శుభమన్ గిల్ యూటర్న్: సారా టెండుల్కర్ తో బ్రేకప్, సారా అలీఖాన్ తో డేటింగ్..!

Published : Aug 30, 2022, 09:49 AM IST
శుభమన్ గిల్ యూటర్న్:  సారా టెండుల్కర్ తో బ్రేకప్, సారా అలీఖాన్ తో డేటింగ్..!

సారాంశం

 త్వరలోనే వీరి పెళ్లి అంటూ కూడా వార్తలు వచ్చాయి. దీనిపై వీరిద్దరూ ఏ రోజు స్పందించలేదు కానీ... ఈ వార్తలు రావడం మాత్రం ఆగలేదు. అయితే.. సడెన్ గా శుభమన్ గిల్ యూటర్న్ తీసుకున్నాడు.  

టీమిండియా యువ క్రికెటర్ శుభమన్ గిల్... నిత్యం వార్తల్లోనే ఉంటాడు. ఒకటి.. మైదానంలో అదరగొడుతూ అయినా వార్తల్లో ఉంటాడు.. లేదంటే.. లవ్ ఎఫైర్ విషయంలో అయినా...వార్తల్లో ఉంటాడు. శుభమన్ గిల్ పేరు వినగానే... సారా టెండుల్కర్ పేరు వినపడుతూ ఉంటుంది. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని గత కొంతకాలంగా గుసగుసలు వినపడుతూ ఉన్నాయి. త్వరలోనే వీరి పెళ్లి అంటూ కూడా వార్తలు వచ్చాయి. దీనిపై వీరిద్దరూ ఏ రోజు స్పందించలేదు కానీ... ఈ వార్తలు రావడం మాత్రం ఆగలేదు. అయితే.. సడెన్ గా శుభమన్ గిల్ యూటర్న్ తీసుకున్నాడు.

సచిన్ కుమార్తె సారా టెండుల్కర్ ని పక్కన పెట్టి... సైఫ్ అలీఖాన్ కుమార్తె, బాలీవుడ్ నటి సారా అలీఖాన్ తో డేటింగ్ మొదలుపెట్టాడట.  దుబాయిలో సారా అలీఖాన్ తో.. శుభమన్ గిల్ డిన్నర్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. వారిద్దరూ డిన్నర్ చేస్తుండగా.. కొందరు గమనించి వారిని ఫోటోలు తీశారు. ఇంకెముంది నెక్ట్స్ మినిట్.. అవి నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఆ వెంటనే వైరల్ గా మారాయి. ఆ ఫోటోలు చూసి కొందరు షాకయ్యారు కూడా..

 

శుభమన్ గిల్.. సారా టెండుల్కర్ ని  వదిలేసి సారా అలీఖాన్ తో డేటింగ్ మొదలుపెట్టాడా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మీమర్స్ అయితే.. గిల్ ని మామూలుగా రోస్ట్ చేయడం లేదు. టెండుల్కర్ అయితే ఏంటీ.. ఖాన్ అయితే ఏంటి..? సారా పేరు కామనే గా అంటూ మీమ్స్ క్రియేట్ చేసి నెట్టింట షేర్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఇటీవలే సారా టెండుల్కర్ తో గిల్ కి బ్రేకప్ అయ్యిందనే వార్తలు కూడా వచ్చాయి. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరిని మరొకరు అన్ ఫాలో చేసుకోవడం గమనార్హం. దీంతో.. ఈ సారా తో బ్రేకప్ కాగానే.. ఆ సారాతో డేటింగ్ మొదలుపెట్టేశాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తలపైన అయినా గిల్ స్పందిస్తాడేమో చూడాలి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !