India vs England Test Series : టీమిండియా పగ్గాలు గిల్ చేతికి ... ఇంగ్లాండ్ టూర్ కు తెలుగు కుర్రాడు

Published : May 24, 2025, 01:53 PM ISTUpdated : May 24, 2025, 02:00 PM IST
India vs England Test Series : టీమిండియా పగ్గాలు గిల్ చేతికి ... ఇంగ్లాండ్ టూర్ కు తెలుగు కుర్రాడు

సారాంశం

రోహిత్ శర్మ తర్వాత శుభ్‌మన్ గిల్ భారత టెస్ట్ కెప్టెన్‌గా నియమితులయ్యారు. రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. కోహ్లీ, అశ్విన్ వంటి కీలక ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత కొత్త నాయకత్వాన్ని ఎంపికచేసింది బిసిసిఐ. 

ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌కు 16 మంది సభ్యుల భారత జట్టును బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఎంపికచేసారు. ఈమేరకు శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ లో ఆడనున్న ఇండియన్ టీంను బిసిసిఐ ప్రకటించింది. 

ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లే భారత జట్టు ఇదే :

శుభ్ మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ద్రువ్ జురేల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ సింగ్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసీద్ కృష్ణ, అకాష్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్

 

 

సీనియర్లను కాదని గిల్ కు అవకాశం :

జూన్ 20న హెడింగ్లీలో జరిగే తొలి మ్యాచ్‌తో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటన ప్రారంభమవుతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత భారత టెస్ట్ క్రికెట్‌లో కొత్త శకం ప్రారంభమయ్యింది. ఈ క్రమంలో టెస్ట్ టీం ప్రకటన చర్చనీయాంశంగా మారింది.  

టెస్ట్ టీం కొత్త సారథిగా శుభ్‌మన్ గిల్ నియమితులయ్యారు. గిల్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, కెఎల్ రాహుల్‌లు కెప్టెన్సీ పోటీలో నిలిచారు…. కానీ సెలెక్టర్లు యంగ్ ప్లేయర్ గిల్‌ వైపే మొగ్గుచూపారు. 

జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ కెప్టెన్సీ రేసులో ఉన్నా, గాయం, వర్క్‌లోడ్ కారణంగా వైదొలిగారు. రిషబ్ పంత్ టెస్ట్‌ల్లో టీమ్ ఇండియా వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు. రోహిత్-కోహ్లీ టెస్టుల నుండి తప్పుకున్న తర్వాత యువ ఆటగాళ్లతో, కొత్త నాయకత్వ యుగం ప్రారంభమైంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నడిరోడ్డుపైనే అభిషేక్ శర్మకు గంభీర్ క్లాస్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
Shimron Hetmyer : హెట్మెయర్ ఫైర్ కాదు.. అల్ట్రా ఫైర్ ! 14 ఫోర్లు, సిక్సర్లతో ఊచకోత