RCB vs SRH : ఇషాన్ కిషన్ ఇరగ్గొట్టాడు.. సెంచరీ మిస్ అయినా విక్టరీని మిస్ కానివ్వలేదు

Published : May 23, 2025, 11:56 PM ISTUpdated : May 24, 2025, 12:02 AM IST
Ishan Kishan (Photo: @ipl/X)

సారాంశం

ప్లేఆఫ్ ఆశలు లేవు… అయినా ముగింపు ఘనంగా ఉండాలని సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశిస్తున్నట్లుంది. అందుకే శక్తివంచన లేకుండా ఆడుతూ ఐపిఎల్ చివర్లో అద్భుతాలు చేస్తోంది. తాజాగా ఆర్సిబిపై అద్భుత విజయాన్ని అందుకుంది. 

IPL 2025 RCB vs SRH : చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ని అద్భుతంగా ఆరంభించిన ఈ జట్టు మధ్యలో తడబడి లీగ్ దశలోనే టోర్నీ నుండి తప్పుకుంది. అయితే చివరగా ఆడుతున్నది నామమాత్రపు మ్యాచులే అయినా హైదరాబాద్ టీం అదరగొడుతోంది. తాజాగా ఐపిఎల్ అద్భుత ఫామ్ ప్రదర్శిస్తూ పాయింట్స్ టేబుల్లో టాప్ 2 లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ను కలిగిన ఆర్సిబిని ఆలౌట్ చేసింది హైదరాబాద్ జట్టు.

మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టీం టోర్నీ ఆరంభంలో ఆడిన మ్యాచ్ ను గుర్తుచేసింది.. అదే మాదిరిగా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ మెరుపు ఆరంభాన్ని అందించాడు.. అతడు కేవలం 17 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసాడు. 

ఇక ఇషాన్ కిషన్ ఈ టోర్నీలో మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.. కేవలం 48 బంతుల్లోనే 94 పరుగులు చేసాడు.. కొద్దిలో మరో సెంచరీని మిస్సయ్యాడు. తర్వాత క్లాసేన్ 13 బంతుల్లో 24 పరుగులు, అనికేత్ వర్మ 9 బంతుల్లో 26 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఎస్ఆర్హెచ్ టీంకు భారీ స్కోరు సాధ్యమయ్యింది.

అయితే భారీ లక్ష్యచేధనలో ఆర్సిబికి కూడా అద్భుత ఆరంభం లభించింది. ఓపెనర్లు పిలిప్ సాల్ట్ (62 పరుగులు, 32 బంతుల్లోనే), విరాట్ కోహ్లీ (43 పరుగులు 25 బంతుల్లోనే) అద్భుతంగా ఆడారు. అయితే వీరు ఔటయ్యాక స్కోరు స్పీడ్ తగ్గింది. క్రమం తప్పకుండా వికెట్లు పడటంతో విజయంవైపు సాగుతున్న ఆర్సిబి ప్రయాణం ఓటమిదిశకు మళ్లింది. చివరకు నిర్ణీత ఓవర్లు కూడా ఆడలేకపోయిన బెంగళూరు టీం మరో బంతి మిగిలివుండగానే ఆలౌట్ అయ్యింది... కేవలం 189 పరుగులకే పరిమితం అయ్యింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : గిల్ రెడీనా? భారత జట్టులోకి ముగ్గురు స్టార్ల రీఎంట్రీ
Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు