మాస్ ఫ్రెండ్షిప్: శుభ్‌మన్ గిల్ దొంగిలించి ప్యారిస్ తీసుకెళ్లిన షర్ట్‌ను ధరించిన ఇషాన్ కిషన్.. పిక్స్ ఇవే

Published : Jul 09, 2023, 02:14 PM IST
మాస్ ఫ్రెండ్షిప్: శుభ్‌మన్ గిల్ దొంగిలించి ప్యారిస్ తీసుకెళ్లిన షర్ట్‌ను ధరించిన ఇషాన్ కిషన్.. పిక్స్ ఇవే

సారాంశం

టీమిండియాలో కొత్త ఫ్రెండ్స్ ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్ మరోసారి సోషల్ మీడియాలో దుమారం రేపారు. ఈ సారి షర్ట్ కేంద్రంగా వార్తల్లోకి వచ్చారు. కొన్నాళ్ల క్రితం శుభ్ మన్ గిల్ ధరించిన షర్ట్‌ను ఇప్పుడు ఇషాన్ కిషన్ ధరించాడు. వారిద్దరూ లంచ్ చేస్తూ దిగిన ఫొటోలతో ఈ విషయం బయటపడింది.  

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెట్ జట్టులో ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ కొత్తగా మిత్రులయ్యారు. ఈ ఓపెనర్లు టీమిండియా భవిష్యత్ అనేది నిర్వివాదాంశం. ఇప్పుడు జట్టులో చోటు కోసం పోటీ పడుతున్నారు. కానీ, ఈ పోటి వారి మధ్య స్నేహానికి ఏమాత్రం అడ్డంకిగా మారలేదు. ఐపీఎల్ సమయంలోనూ వీరిద్దరూ ఒకరిపై మరొకరు పేల్చుకున్న జోకులు, అవాకులు, చెవాకులు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వెస్టిండీస్ పర్యటనలోనూ ఈ మైత్రిలో ఏ మార్పు రాలేదు.

శనివారం వీరిద్దరూ కలిసి స్టైల్ షర్టులు ధరించి లంచ్‌ చేయడానికి వెళ్లారు. వీళ్లిద్దరూ లంచ్ ఎంజాయ్ చేస్తూ కెమెరాకు ఫోజులు ఇచ్చారు. వారిద్దరికీ ఇష్టమైన  సుషీ డిష్ ఆరగిస్తూ ఎంజాయ్ చేశారు. ఇదంతా ఒకవైపు.. మరోవైపు ముంబయి ఇండియన్స్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పసిగట్టింది. 

Also Read: పెంపుడు కుక్కలతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న ధోనీ... కొన్ని నెలల తర్వాత ఇన్‌స్టాలో పోస్ట్...

లంచ్ చేస్తూ దిగిన ఫొటోలో ఇషాన్ కిషన్ ధరించిన షర్ట్ గతంలో శుభ్ మన్ గిల్ తన ప్యారిస్ ట్రిప్‌లో ధరించినట్టు గుర్తించారు. కొన్ని వారాల క్రితం శుభ్ మన్ గిల్ ప్యారిస్‌కు పీఎస్‌జీ క్లబ్ సందర్శనార్థం వెళ్లినప్పుడు ఇదే షర్ట్ ధరించిన ఫొటోను పట్టుకున్నారు. అదే షర్ట్‌ను ఇప్పుడు ఇషాన్ కిషన్ ధరించారు.

శుభ్ మన్ గిల్ పై కిషన్ చేసిన కామెంట్ కూడా వైరల్ అయింది. ‘బ్రో.. ఆ షర్ట్ వెస్టిండీస్‌కు తీసుకురావా? దాని కోసం ఇక్కడ ఎక్కడపడితే అక్కడే వెతుకుతున్నా’ అంటూ కామెంట్ చేశాడు. దానికి గిల్ కూడా ఫన్నీ కామెంట్ చేశాడు. ‘హా.. హా.. మరి నా కోసం ఆ షర్ట్ ప్యాక్ చేశావు. అబద్ధాలకోరు’ అంటూ కామెంట్ చేశాడు.

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !