
శ్రేయస్ అయ్యర్, అసలు అహ్మదాబాద్ టెస్టులో ఆడతాడా? లేదా? అనే విషయానికి క్లారిటీ వచ్చేసింది. మూడో రోజు ఫీల్డింగ్ చేస్తూ వెన్నునొప్పితో పెవిలియన్ చేరిన శ్రేయాస్ అయ్యర్, ఆఖరి రోజు ఆటకు దూరమయ్యాడు. గాయం కారణంగా అతన్ని ఆఖరి టెస్టు ఆఖరి రోజు ఆట నుంచి తప్పిస్తున్నట్టు బీసీసీఐ తెలియచేసింది...
చివరి రోజు టీమిండియా బ్యాటింగ్‌కి వస్తే, శ్రేయాస్ అయ్యర్ స్థానంలో కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తాడు. మూడో రోజు వెన్నునొప్పితో బాధపడిన శ్రేయాస్ అయ్యర్‌ని స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించారు బీసీసీఐ వైద్య సిబ్బంది...
శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని వైద్యులు తేల్చడంతో అతన్ని నాలుగో టెస్టు నుంచి తప్పించారు. శ్రేయాస్ అయ్యర్ హెల్త్ గురించి సరైన అప్‌డేట్ ఇవ్వకపోవడం వల్ల తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా తరుపున 10 మంది బ్యాటర్లే బ్యాటింగ్ చేశారు. సాధారణంగా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చే శ్రేయాస్ అయ్యర్ స్థానంలో రవీంద్ర జడేజా బ్యాటింగ్‌కి వచ్చాడు...
జడేజా అవుటైన తర్వాతైనా శ్రేయాస్ అయ్యర్ వస్తాడనుకుంటే అలా జరగలేదు. ఆరో స్థానంలో వికెట్ కీపర్ శ్రీకర్ భరత్, ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ బ్యాటింగ్‌కి వచ్చారు. శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా బ్యాటింగ్‌కి రాకపోవడంతో ఓ రకంగా విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు...
రవిచంద్రన్ అశ్విన్ అవుటైన తర్వాత టెయిలెండర్లతో బ్యాటింగ్ చేయాల్సి రావడంతో అనవసర ఒత్తిడికి గురైన విరాట్ కోహ్లీ... స్ట్రైయిక్ కోసం 2 పరుగులు తీసేందుకు ఉసిగొలిపి ఉమేశ్ యాదవ్‌ని డైమండ్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు...
ఆ తర్వాత మహ్మద్ షమీతో కలిసి రెండు ఓవర్లు బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ, బౌండరీలు రాకపోవడంతో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. గత రెండేళ్లలో శ్రేయాస్ అయ్యర్ గాయంతో టీమ్‌కి దూరం కావడం ఇది నాలుగోసారి. 2021 ఐపీఎల్‌కి ముందు ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన శ్రేయాస్ అయ్యర్, ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్ మొత్తానికి దూరమయ్యాడు...
ఆరు నెలల తర్వాత గాయం నుంచి పూర్తిగా కోలుకుని రీఎంట్రీ ఇచ్చినా అప్పటికే సూర్యకుమార్ యాదవ్ వల్ల టీమిండియాలో చోటు కోల్పోయిన శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ కారణంగా ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. గాయంతో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కి దూరమైన శ్రేయాస్ అయ్యర్, నాగ్‌పూర్‌లో జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్టులో కూడా ఆడలేదు. శ్రేయాస్ అయ్యర్ దూరం కావడంతో అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ని ఆడించింది టీమిండియా. సూర్యకుమార్ యాదవ్ తన మొట్టమొదటి టెస్టులో 20 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
శ్రేయాస్ అయ్యర్ గాయంతో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కి కూడా దూరమైనట్టు సమాచారం. ఇదే నిజమైతే వన్డే ఫార్మాట్‌లో వరుసగా ఫెయిల్ అవుతున్న సూర్యకుమార్ యాదవ్‌కి మరో అవకాశం దొరికినట్టు అవుతుంది. అయ్యర్ గాయం కోలుకోవడానికి మరింత సమయం కావాలిన వైద్యులు సూచిస్తే, ఐపీఎల్ 2023 సీజన్‌కి కూడా అతను దూరం కావచ్చు. ఇది కేకేఆర్‌ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసే అవకాశం ఉంది.