రష్మిక మందన్నాపై క్రష్.. ఎట్టకేలకు మౌనం వీడిన శుభమన్ గిల్

Siva Kodati |  
Published : Mar 12, 2023, 06:39 PM IST
రష్మిక మందన్నాపై క్రష్.. ఎట్టకేలకు మౌనం వీడిన శుభమన్ గిల్

సారాంశం

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నపై టీమిండియా స్టార్ క్రికెటర్ శుభమన్ గిల్ మనసు పారేసుకున్నాడంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు గిల్. అసలు ఈ విషయాన్ని ఎవరు నిర్థారించారని ఆయన ప్రశ్నించారు. 

టీమిండియా బ్యాటింగ్ సంచలనం శుభమన్ గిల్ .. నటి రష్మిక మందన్నాలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నారు. రష్మికపై గిల్‌కు క్రష్ వుందంటూ గత కొద్దిరోజులుగా మీడియాలో కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తనకు రష్మికా మందన్నపై క్రష్ వుందని శుభమన్ గిల్ వెల్లడించాడు. అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించిన ఆయన.. తనకు సారా అలీఖాన్, సారా టెండూల్కర్‌లతో పాటు దక్షిణాది నటిపైనా క్రష్ వుందన్నారు. అయితే ఇష్టమైన నటి ఎవరంటే రష్మిక పేరే చెప్పడంతో మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ మీడియా సంస్థ గిల్ తాజా క్రష్ రష్మిక మందన్న అంటూ పెట్టిన పోస్ట్‌పై టీమిండియా స్టార్ స్పందించాడు. దీనిని ఎవరు నిర్ధారించారని శుభమన్ ప్రశ్నించాడు. 

ఇంతలో సారా అలీఖాన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఈ జంట కలిసి రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్నట్లుగా ఫోటోలు కలకలం రేపుతున్నాయి. అదే సమయంలో సోనమ్ బజ్వాతో మాట్లాడుతుండగా.. సారా తో డేటింగ్‌లో వున్నారా , లేదా అని అడగ్గా.. శుభమన్ గిల్ నవ్వు నవ్వి వదిలేశారు. దీనికి సోనమ్ స్పందిస్తూ.. నిజం చెప్పండి సార్ కౌంటరిచ్చారు. ఆ వెంటనే శుభమన్ ఇది నిజం కావొచ్చు, కాకపోవచ్చంటూ ఆన్సర్ ఇచ్చారు. 

కాగా.. గతంలో శుభమన్ గిల్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. అదే సమయంలో రష్మిక.. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి.  ఇక క్రికెట్ వార్తాల విషయానికి వస్తే.. శుభమన్ గిల్ ఇటీవలే మరో సెంచరీ బాదాడు (స్వదేశంలో మొదటి టెస్ట్ సెంచరీ). బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో గిల్ ఈ సెంచరీ సాధించాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !