యువరాజ్ సరసన శ్రేయాస్ గోపాల్... హ్యాట్రిక్‌ ప్రదర్శనతో అరుదైన రికార్డు

By Arun Kumar PFirst Published May 1, 2019, 2:12 PM IST
Highlights

ఐపిఎల్ సీజన్ 12 లో మరో హ్యాట్రిక్ నమోదయ్యింది. రాజస్థాన్ బౌలర్ శ్రేయాస్ గోపాల్ మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై జరిగిన మ్యాచ్ లో అదరగొట్టాడు. అతడి  బౌలింగ్ మాయాజాలానికి ఆర్సిబి టాప్ ఆర్డర్ కకావికలమైపోయింది. ప్రపంచ స్థాయి బ్యాట్ మెన్స్ విరాట్ కోహ్లీ, డివిలియర్స్, స్టోయినీస్ లను వరుస బంతుల్లో పెవిలియన్ పంపించి ఈ యువ బౌలర్ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ హ్యాట్రిక్ సాధించాడు.

వర్షం కారణంగా రాజస్థాన్, ఆర్సిబిల మధ్య జరిగిన మ్యాచ్ ఐదు ఓవర్లకు కుదించారు. అయితే ఇప్పటికే ప్లేఆఫ్ పై ఆశలు కోల్పోయిన ఆర్సిబి ఎలాంటి ఒత్తిడి దాటిగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ గా బరిలోకి దిగిన కోహ్లీ, డివిలియర్స్ లు మొదటి ఓవర్ నుండే రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వరుణ్ ఆరోన్ వేసిన మొదటి ఓవర్లో ఏకంగా 23 పరుగులను పిండుకున్నారు. ఆ తర్వాతి ఓవర్లోనే శ్రేయాస్ గోపాల్ మాయ మొదలయ్యింది. 

గోపాల్ వేసిన రెండో ఓవర్ మొదట్లో కూడా ఆర్సిబి ఓపెనర్లు భారీ షాట్లు బాది 3 బంతుల్లో 12 పరుగులు చేశారు. ఆ తర్వాతే అసలు కథ మొదలయ్యింది.గోపాల్ నాలుగో బంతికి కోహ్లీ ఔటయ్యాడు. ఓ అద్భుతమైన బంతితో కోహ్లీని బోల్తా కొట్టించి బంతిని గాల్లోకి లేపేలా చేసాడు. లింవిగ్ స్టోన్ ఆ క్యాచ్ అందుకోడంతో ఆర్సిబి కెప్టెన్ పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత ఐదో బంతికే విధ్వంసక ఆటగాడు డివిలియర్స్ కూడా ఔటయ్యాడు. ఇక చివరి బంతికే స్టోయినీస్ కూడా డకౌటవడంతో గోపాల్ ఖాతాలోకి మరో హ్యాట్రిక్ చేరింది. 

ఈ హ్యాట్రిక్ ప్రదర్శనతో శ్రేయాస్ గోపాల్ ఓ అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. ఒకటికంటే ఎక్కువసార్లు హ్యాట్రిక్ వికెట్లను సాధించిన మూడో భారత బౌలర్ గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు అమిత్ మిశ్రా, యువరాజ్ సింగ్ లు టీ20 ఫార్మాట్లో ఒకటికంటే ఎక్కువసార్లు హ్యాట్రిక్ సాధించగా తాజాగా గోపాల్ కూడా వారి సరసన చేరిపోయాడు. 2018-19 సంవత్సరంలో సయ్యద్ మస్తాన్ అలీ ట్రోపి లో కూడా కర్ణాటక తరపున ఆడిన  శ్రేయాస్ హర్యానా  జట్టుపై హ్యాట్రికి సాధించాడు. మళ్లీ ఇప్పుడు బెంగళూరుపై ఆ ఘనత సాధించాడు. 
 
click me!