టీమ్ మేట్ బెడ్రూంలో మహిళపై క్రికెటర్ లైంగిక దాడి

By telugu teamFirst Published May 1, 2019, 1:12 PM IST
Highlights

2017లో వాట్సాప్‌ గ్రూప్‌ పెట్టిన తొలిరాత్రే  వర్సెస్టర్‌లోని హెప్‌బర్న్‌ ఫ్లాట్‌లో ఆ ఘటన జరిగింది. హెప్‌బర్న్‌ జట్టు సహచరుడైన జోయి క్లార్క్‌ ఓ నైట్‌క్లబ్‌లో తనకు పరిచయం అయ్యాడని, అతనితో తన ఇష్టంతోనే శృంగారంలో పాల్గొన్నానని బాధితురాలు కోర్టుకు తెలిపింది. 

లండన్‌: తన జట్టు సభ్యుడి బెడ్‌రూమ్‌లో నిద్రిస్తున్న మహిళపై లైంగిక దాడి చేసిన క్రికెటర్‌కు బ్రిటిష్‌ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇంగ్లాండ్‌ కౌంటీ జట్టు వర్సెస్టర్‌ మాజీ ఆల్‌రౌండర్‌, ఆస్ట్రేలియా సంతతికి చెందిన 23 ఏళ్ల అలెక్స్‌ హెప్‌బర్న్‌కు ఆ శిక్ష విధించింది. 

ఎక్కువ మంది మగువలతో శృంగారం చేయాలంటూ ఓ వాట్సాప్‌ గ్రూప్‌ పెట్టి.. పోటీని సృష్టించిన హెప్‌బర్న్‌ 2017 ఏప్రిల్‌లో మహిళపై లైంగిక దాడి చేశాడు. ఈ వాట్సాప్‌ గ్రూప్‌ పెట్టినందుకు వర్సెస్టర్‌ జట్టు నుంచి అతన్ని తొలగించారు.

2017లో వాట్సాప్‌ గ్రూప్‌ పెట్టిన తొలిరాత్రే  వర్సెస్టర్‌లోని హెప్‌బర్న్‌ ఫ్లాట్‌లో ఆ ఘటన జరిగింది. హెప్‌బర్న్‌ జట్టు సహచరుడైన జోయి క్లార్క్‌ ఓ నైట్‌క్లబ్‌లో తనకు పరిచయం అయ్యాడని, అతనితో తన ఇష్టంతోనే శృంగారంలో పాల్గొన్నానని బాధితురాలు కోర్టుకు తెలిపింది. 

ఆ రోజు తెల్లవారుజామున అతను బెడ్‌రూమ్‌ నుంచి వెళ్లిపోయిన తర్వాత హెప్‌బర్న్‌ రహస్యంగా గదిలోకి చొరబడ్డాడని, నిద్రిస్తున్న తనపై అతను లైంగిక చర్యకు ఒడిగట్టాడని,  క్లార్క్‌గా భావించి అతనితో శృంగారంలో పాల్గొన్నానని బాధితురాలు చెప్పింది. కానీ, అతను హెప్‌బర్న్‌ అని తెలియడంతో షాక్‌ తిన్నానని ఆమె కోర్టుకు తెలిపింది.

హెప్‌బర్న్‌ అహంకారపూరితమైన ధోరణిపై జడ్జి జిమ్‌ టిండల్‌ విచారణ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత మూర్ఖంగా హెప్‌బర్న్‌, అతని జట్టు సహచరుడు శృంగార సంబంధిత గేమ్‌లో పాల్గొనడానికి అంగీకరించారని, ఇది కుర్ర చర్యగా మీరు భావించి ఉంటారని, కానీ, ఇది దారుణమైన సెక్సిజమేనని న్యాయమూర్తి అన్నారు. 

బాధితురాలు ధైర్యంగా ముందుకొచ్చి.. జరిగిన క్రూరమైన నేరం గురించి కోర్టుకు తెలిపిందని జడ్జి ప్రశంసించారు. హెప్‌బర్న్‌పై ఓరల్‌ రేప్‌ నేరాన్ని ధ్రువీకరించిన కోర్టు ఇతర రేప్‌ అభియోగాలను తొలగించింది. 

click me!