. ఆయేషా ముఖర్జీ తనను మానసికంగా వేధించిందన్న శిఖర్ ధావన్ వ్యాఖ్యను కోర్టు సమర్థించింది. ఒక్కగానొక్క కుమారుడితో కొన్నాళ్ల పాటు విడిగా ఉండాలని భార్య ఆయేషా ఒత్తిడి చేయడంతో ధావన్ మానసిక వేదనకు గురయ్యారని కోర్టు అభిప్రాయపడింది.
టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ కి విడాకులు మంజూరైన విషయం తెలిసిందే. దిల్లీలోని ఫ్యామిలీ కోర్టు భారత క్రికెటర్ శిఖర్ ధావన్-అతడి మాజీ భార్య అయేషా ముఖర్జీకి ఇటీవల విడాకులు మంజూరు చేసింది. విచారణ సందర్భంగా ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి హరీశ్ కుమార్.. ధావన్ చేసిన ఆరోపణలు అన్నీ నిజమైనవని విశ్వసించారు. ఆయేషా ముఖర్జీ తనను మానసికంగా వేధించిందన్న శిఖర్ ధావన్ వ్యాఖ్యను కోర్టు సమర్థించింది. ఒక్కగానొక్క కుమారుడితో కొన్నాళ్ల పాటు విడిగా ఉండాలని భార్య ఆయేషా ఒత్తిడి చేయడంతో ధావన్ మానసిక వేదనకు గురయ్యారని కోర్టు అభిప్రాయపడింది.
బార్ అండ్ బెంచ్‌లోని నివేదిక ప్రకారం, శిఖర్ ఆస్ట్రేలియాలో కొనుగోలు చేసిన మూడు ఆస్తులలో 99 శాతం వాటాను ఆయేషా కోరుకుంటుందని ధావన్ ఆరోపించారు. అంతేకాకుండా, ఆయేషా మరో రెండు ఆస్తులకు జాయింట్ ఓనర్ కావాలని కోరుకుంది. ఇంకా, కోవిడ్-19 సమయంలో తన తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లినందుకు శిఖర్‌తో ఆయేషా గొడవ పడిందట.
బిసిసిఐ అధికారులు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్ల యజమానులకు పరువు నష్టం కలిగించే సందేశాలను పంపారనే ఆరోపణలపై ఆయేషా చేసిన వాదనను కూడా కోర్టు తిరస్కరించింది. తనకు నెలవారీ చెల్లింపులు పంపమని శిఖర్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అతని ముగ్గురు స్నేహితులకు మాత్రమే మెసేజ్‌లు పంపడం గమనార్హం.
శిఖర్ విడాకులు తీసుకున్న తర్వాత లాయర్ దీపికా భరద్వాజ్ ట్వీట్ చేసింది, భారత క్రికెటర్ శిఖర్ ధావన్ 8 సంవత్సరాల వివాహానికి 13 కోట్ల రూపాయలను ఆయేషాకు పంపాడు, అయితే ఈ జంట 8 సంవత్సరాల వివాహంలో కంటిన్యూగా కూడా కలిసి జీవించలేదు.ఆయేషా, శిఖర్ 2012లో వివాహం చేసుకున్నారు. వారి కుమారుడు జోరావర్ కూడా ఆస్ట్రేలియాలో జన్మించినందున, శిఖర్ తన కొడుకుతో ఎక్కువ కాలం జీవించలేకపోయాడు. కోర్టు తీర్పును చదివిన దీపిక, ఆయేషా తన మునుపటి భర్త నుండి పిల్లలకు మద్దతు పొందుతూనే ఉన్నారు. అయినప్పటికీ, తన ఇద్దరు కుమార్తెల కోసం శిఖర్‌ను డబ్బులు అడుగుతున్నారట. ఈ విషయాన్ని ఆయన లాయర్ ట్వీట్ లో పేర్కొనడం విశేషం.