ధావన్‌కు తెలియకుండానే పెళ్లి ఫిక్స్ చేసిన అతడి తండ్రి.. హ్యూమా ఖురేషి తోనే అంటూ గుసగుసలు

By Srinivas M  |  First Published Oct 16, 2022, 1:51 PM IST

Shikhar Dhawan: తనకు తెలియకుండానే పెళ్లి కుదర్చడం దారుణమని, అలా ఎందుకు చేస్తున్నావని ధావన్ అతడి తండ్రిని నిలదీయగా.. ఆయన  అదిరిపోయే సమాధానం ఇచ్చారు.


టీమిండియా ఓపెనర్,  రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ  లేకుంటే భారత సారథ్య బాధ్యతలు మోస్తున్న శిఖర్ ధావన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో  పోస్ట్ చేసిన ఓ వీడియో ఆసక్తి రేకెత్తిస్తున్నది. తనకు తెలియకుండానే పెళ్లి కుదర్చడం దారుణమని, అలా ఎందుకు చేస్తున్నావని ధావన్ అతడి తండ్రిని నిలదీయగా.. ఆయన  అదిరిపోయే సమాధానం ఇచ్చారు. అయితే  ఇద్దరి మధ్యలోకి బాలీవుడ్ నటి  హ్యూమా ఖురేషి కూడా ఎంట్రీ ఇచ్చింది.  దీంతో నెటిజన్లంతా  ‘భయ్యా.. బాబీ మిల్‌గయి (దొరికింది)’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలేం జరిగింది..? 

ఆటతో పాటు సోషల్ మీడియాలో  పోస్టుల ద్వారా అభిమానులను అలరించడంలో ధావన్  ముందుంటాడు. ఇన్‌స్టాగ్రామ్ లో ఫన్నీ రీల్స్ చేస్తూ ఫన్ ను పంచుతాడు. తాజాగా ధావన్ చేసిన పని కూడా ఇలాంటిదే. అయితే ఈసారి మిగతా విషయాల జోలికి పోకుండా ఏకంగా తన పెళ్లి మీదే సెటైర్ వేసుకున్నాడు. 

Latest Videos

ఓ బాలీవుడ్ సినిమాలోని తండ్రీ కొడుకుల మధ్య పెళ్లి గురించి  సాగే  డైలాగ్ తో ధావన్, అతడి తండ్రి అలరించారు. ఈ వీడియోలో ధావన్.. ‘నన్ను అడగకుండా నా పెళ్లి ఎలా ఫిక్స్ చేశారు నాన్న..?’ అని ప్రశ్నిస్తాడు. దానికి అతడి తండ్రి.. ‘నిన్ను అడిగే నీకు జన్మనిచ్చామా..?’ అని కౌంటర్ ఇచ్చాడు. 

 

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అయితే ధావన్ వీడియో పోస్ట్ చేయగానే  బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి   స్మైలీ సింబల్ తో కూడా ఎమోజీలను షేర్ చేసింది.  ఖురేషి పోస్టు చేయగానే నెటిజన్లు.. ‘ధావన్ భయ్యా.. వదిన దొరికేసింది..’ అని కామెంట్స్ చేస్తున్నారు.  ఖురేషి ధావన్  పోస్టుకు కామెంట్ చేయడం  వెనుక ఆమె  స్వార్థం కూడా లేకపోలేదు. హ్యూమా ఖురేషి, సోనాక్షి సిన్హాలు కలిసి నటించిన బాలీవుడ్ చిత్రం ‘డబుల్ ఎక్సెల్’. ఈ సినిమాలో ధావన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే హ్యూమా.. ధావన్ తో కలిసి  డాన్స్ చేస్తున్న స్టిల్స్ ను తన ఇన్స్టా ఖాతాలో పంచుకుంది.  

ఇక  పెళ్లికి సంబంధించి ధావన్ ఇలాంటి వీడియోలు చేయడం ఇదేం కొత్త కాదు. కొద్దిరోజుల  క్రితం ధావన్.. రవీంద్ర జడేజాతో కలిసి ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో జడేజా చైర్ లో కూర్చుని ఉంటే ధావన్ బాంగ్రా డాన్స్ చేస్తూ పిచ్చిపిచ్చిగా ఎంజాచ్ చేస్తుంటాడు. అప్పుడు జడేజా.. ‘ఇతడికి త్వరగా పెళ్లి చేసేయండి. అప్పుడైనా బాధ్యతలు తెలిసొచ్చి ఈ కుప్పిగంతులు మానేసి బుద్దిగా పనిచేసుకుంటాడు..’ అంటూ ఫన్నీగా చెప్పాడు. దానికి ధావన్.. ‘వామ్మో.. ఇప్పుడే వద్దు.. కొన్ని రోజులాగు..’ అని  కామెంట్ పెడుతూ పోస్ట్ చేశాడు. ఈ వీడియో కూడా గతంలో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 

 

ఇదిలాఉండగా ధావన్ వైవాహిక జీవితం కాస్త ట్రాజెడీగానే ఉంది. 2012లో అతడు  అయేషా ముఖర్జీ అనే ఆస్ట్రేలియా సంతతి భారత మహిళను పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నా ధావన్ ఆమెను వివాహమాడాడు. ఈ ఇద్దరికీ  2014లో ఓ బాబు కూడా పుట్టాడు.  ఎనిమిదేండ్ల  తర్వాత ఈ కాపురంలో కలహాలతో ఈ ఇద్దరూ గతేడాది నుంచి విడివిడిగా ఉంటున్నారు.

click me!