శిఖర్ ధావన్ ఐపిఎల్ కలను అడ్డుకున్న సహచరుడు... అభిమానుల ఆగ్రహం

By Arun Kumar PFirst Published Apr 13, 2019, 12:30 PM IST
Highlights

శుక్రవారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో డిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆకాశమే హద్దుగా  చెలరేగాడు. కోల్ కతా నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఒంటిచేత్తో చేధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే అతడు కేవలం మూడు పరుగుల తేడాతో సెంచరీని మిస్సయ్యాడు. ఇలా ధావర్  ఐపిఎల్ సెంచరీ కల మళ్లీ వాయిదా పడింది. 

శుక్రవారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో డిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆకాశమే హద్దుగా  చెలరేగాడు. కోల్ కతా నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఒంటిచేత్తో చేధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే అతడు కేవలం మూడు పరుగుల తేడాతో సెంచరీని మిస్సయ్యాడు. ఇలా ధావన్  ఐపిఎల్ సెంచరీ కల మళ్లీ వాయిదా పడింది. 

ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన  మ్యాచ్ లో  కోల్ కతా జట్టు మొదట బ్యాటింగ్ చేసి 178 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన డిల్లీ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ వీరోచిత ఇన్నింగ్స్ తో విజయాన్ని అందుకుంది. అయితే ధావన్ 97 పరుగులతో సెంచరీకి చేరువైన సమయంలో సహచర ఆటగాడు కొలింగ్ ఇంగ్రామ్ విన్నింగ్ సిక్సర్ బాదాడు. ఇలా అతడు జట్టు కోసమే సిక్సర్ బాదినప్పటికి అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. 

మొదటినుండి జట్టుకోసం పోరాడిని ధావన్ కు ఇంగ్రామ్ సెంచరీ చేసుకునే అవకాశం ఇవ్వాల్సిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. డిల్లీ విజయానికి 8 బంతుల్లో కేవలం 6 పరుగులు మాత్రమే అవసరమున్న సమయంలో ధావన్ సింగిల్ తీసి ఇంగ్రామ్ కు స్ట్రైక్ రొటేట్ చేశాడు. ఆ సమయంలో ధావన్ 97 పరుగుల వద్ద వున్నాడు. ఇంకా ఐదు పరుగులు అవసరం కాబట్టి అతడు తప్పకుండా తన ఐపిఎల్ కెరీర్లో మొదటి సెంచరీని పూర్తి చేసుకుంటాడని అందరూ భావించారు. 

అయితే ధావన్ సెంచరీ ఆశలపై ఇంగ్రామ్ నీళ్లు చల్లాడు. ధావన్ కు మళ్లీ బ్యాటింగ్ చేసే అవకాశమివ్వకుండానే సిక్సర్ బాది ఇన్నింగ్స్ పూర్తిచేశాడు. ఇలా జట్టుకు విజయాన్ని అందించడం  బాగానే వున్నా ధావన్ సెంచరీ చేయకుండా అడ్డుకోవడంతో అతడు విమర్శలకు గురవుతున్నాడు.  ధావన్‌ అభిమానులు ఇన్‌గ్రామ్‌పై సోషల్‌ మీడియా వేదికగా ఇంగ్రామ్ పై దుమ్మెత్తిపోస్తున్నారు.  

అయితే శిఖర్ ధావన్ మాత్రం తనకు వ్యక్తిగత రికార్డుల కన్నా జట్టు ప్రయోజనాలే ముఖ్యమని అన్నాడు. అందుకే రిస్క్‌ తీసుకోకుండా ఆడానని పేర్కొన్నాడు. సెంచరీ సాధించలేకపోవడం తననేమీ బాధించడం లేదని...జట్టు విజయం సాధించింది అందుకు ఆనందంగా వుందని ధావన్ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు.  
 

click me!