చెలరేగిన శిఖర్ ధావన్: కోల్ కతాపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

By telugu teamFirst Published Apr 13, 2019, 7:40 AM IST
Highlights

 కొలిన్ ఇన్‌గ్రామ్ (14), ధావన్‌(97)తో కలిసి చెలరేగి ఆడాడు. దీంతో ఢిల్లీ 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. 

కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపిఎల్)లో భాగంగా కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావవన్ చెలరేగి ఆడి తమ జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. 

తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ 3వ ఓవర్‌లో తొలి వికెట్ కోల్పోయింది. ప్రశిద్ధ్ కృష్ణ వేసిన ఈ ఓవర్‌లో పృథ్వీ షా కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత రస్సెల్ వేసిన ఆరో ఓవర్ 4వ బంతికి శ్రేయాస్ (6) కూడా కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

ఈ దశలో కష్టాల్లోపడ్డ ధావన్, పంత్‌ల జోడీ జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కి 105 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ధావన్ ఐపీఎల్‌లో 32వ అర్థశతకాన్ని నమోదు చేశాడు.  రిషబ్ పంత్ కూడా ధావన్ కు చక్కటి సహకారం అందించాడు. అయితే రిషబ్ పంత్ (46) నితీశ్ రానా బౌలింగ్ కుల్దీప్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 

ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన కొలిన్ ఇన్‌గ్రామ్ (14), ధావన్‌(97)తో కలిసి చెలరేగి ఆడాడు. దీంతో ఢిల్లీ 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.

click me!