సొంత మైదానంలో మా జట్టు ఓటమికి కారణమిదే: దినేశ్ కార్తిక్

Published : Apr 13, 2019, 11:22 AM IST
సొంత మైదానంలో మా జట్టు ఓటమికి కారణమిదే: దినేశ్ కార్తిక్

సారాంశం

ఐపిఎల్ 2019 లీగ్ దశలో భాగంగా శుక్రవారం ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై డిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. కోల్ కతా నిర్దేశించిన 178 పరుగుల భారీ లక్ష్యాన్ని డిల్లీ మరో ఓవర్ మిగిలుండగానే చేధించింది. అయితే ఈ ఓటమికి  తాము జట్టులో చేసిన ప్రయోగాలతో పాటు బ్యాటింగ్, బౌలింగ్ లో విఫలమవడమే కారణమని కోల్ కతా కెప్టెన్ దినేశ్ కార్తిక్ అభిప్రాయపడ్డారు.  

మ్యాచ్ ముగిసిన అనంతర దినేశ్ మీడియాతో మాట్లాడుతూ... ఓపెనర్లు లిన్ -నరైన్ జోడిని తప్పించి  తాము చేసిన ప్రయోగం విఫలమైందని అన్నాడు.  వారిద్దరు జట్టులో లేని ప్రభావం తమ బ్యాటింగ్ లో స్పష్టంగా కనిపించిందన్నారు. వారి స్థానంలో జట్టులోకి వచ్చిన శుభ్ మన్ గిల్ రాణించినప్పటికి మరో ఆటగాడు డెన్లీ డకౌటవడం మిగతా బ్యాట్ మెన్స్ పై ఒత్తిడిని పెంచిందన్నాడు. 178 పరుగులు మంచి స్కోరేనని అయితే మరో 10,15 పరుగులు చేస్తే బావుండేదనన్నారు. తామే చేజేతులా ఆ అవకాశాన్ని వదులుకున్నామని కార్తిక్ అభిప్రాయపడ్డారు. 

ఇక తమ బౌలింగ్ విభాగం కూడా భారీ లక్ష్యాన్ని కూడా కాపాడలేకపోయిందని అసహనం వ్యక్తం చేశారు. 178 పరుగులను డిల్లీ మరో ఓవర్ మిగిలుండగానే చేధించిందంటే అది తమ  బౌలర్ల వైఫల్యమేనన్నాడు. బౌలర్లు తమ బౌలింగ్ మ్యాజిక్ తో  విజయాన్ని అందిస్తారని అనుకున్నానని...కానీ తన నమ్మకాన్ని వారు వమ్ము చేశారన్నారు. ఈ పరాజయం నుండయినా బౌలర్లు తప్పిదాలను గుర్తించి వాటిని సరిచేసుకుంటారని భావిస్తున్నట్లు కార్తిక్ తెలిపాడు. 

అయితే ప్రతి జట్టుకు గెలుపోటములు సహజమేనని...ఈ ఓటమి నుండి తాము మరిన్ని విషయాలు నేర్చుకున్నమని పేర్కొన్నాడు. తదుపరి మ్యాచుల్లో పుంజుకుని విజయాలు సాధిస్తామని కార్తిక్ ధీమా వ్యక్తం చేశాడు. 

PREV
click me!

Recommended Stories

IND vs BAN : తగ్గేదే లే.. బంగ్లాదేశ్ కు ఇచ్చిపడేసిన భారత్.. గ్రౌండ్‌లో హీట్ పుట్టించిన కెప్టెన్లు !
Vaibhav Suryavanshi : ఊచకోత అంటే ఇదే.. బంగ్లా బౌలర్లని ఉతికారేసిన వైభవ్ ! కోహ్లీ రికార్డు పాయే