టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అయితే మరింతగా ఎంజాయ్ చేస్తున్నాడు. తన కుమారుడు జొరావర్‌తో శిఖర్ ఇండోర్ క్రికెట్ ఆడాడు. ఆ వీడియోకు కామెంటరీతో పాటు ప్రేక్షకుల ఆరుపులను జత చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో బుధవారం పోస్ట్ చేశాడు.
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ భారత్ లోనూ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ నడుస్తోంది. ఈ కరోనా వైరస్ తో క్రీడా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ జరగాల్సిన అన్ని క్రీడలు ఆగిపోయాయి.
దీంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లోనే కుటుంబసభ్యులతో గుడుపుతూ కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న మొదట్లొ క్రీడాకారులంతా సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ ఒకరిపై మరొకరు విసిరారు.
Quarantine Premier League ka sabse gripping moment 😅 Dhawan vs Dhawan 💪🏻😈 pic.twitter.com/fDHVF8nVYC
— Shikhar Dhawan (@SDhawan25)
undefined
కాగా.. ఎవరికి తోచిన టైంపాస్ వాళ్లు చేస్తున్నారు. విరాట్ కోహ్లీ, అనుష్కతో సరదాగా గడుపుతుంటే.. ఇతర క్రికెటర్లు.. తమ పిల్లలతో గడుపుతున్నారు.
తాజాగా.. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అయితే మరింతగా ఎంజాయ్ చేస్తున్నాడు. తన కుమారుడు జొరావర్‌తో శిఖర్ ఇండోర్ క్రికెట్ ఆడాడు. ఆ వీడియోకు కామెంటరీతో పాటు ప్రేక్షకుల ఆరుపులను జత చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో బుధవారం పోస్ట్ చేశాడు.
జొరావర్ బౌలింగ్ చేయగా శిఖర్ బ్యాట్‌తో అదరగొట్టాడు. సీరియస్‌గా సాగిన మ్యాచ్‌లో తండ్రీకొడుకులు ఓ దశలో సరదాగా స్లెడ్జ్ చేసుకున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన శిఖర్ “క్వారంటైన్ ప్రీమియర్ లీగ్‌లో అన్నింటికన్నా ఉత్కంఠ క్షణాలు. ధవన్ వర్సెస్ ధవన్” అని క్యాప్షన్ జత చేశాడు. కుమారుడితో ఆడుకోవడంతో ధవన్ ఇంటి పనుల్లో సైతం పాలుపంచుకుంటున్నాడు.