దాదా గొప్ప కెప్టెన్.. ధోనీ టాప్‌, కానీ కుంబ్లే అత్యుత్తమ సారథి: గంభీర్

By Siva KodatiFirst Published Apr 22, 2020, 7:11 PM IST
Highlights

తన క్రికెట్ కెరీర్‌‌లోని టీమిండియా కెప్టెన్‌లలో అనిల్ కుంబ్లే అత్యుత్తమ సారథిగా గంభీర్ అభిప్రాయపడ్డాడు. రికార్డుల  పరంగా ధోనిలో టాప్‌లో ఉండొచ్చని కానీ తన దృష్టిలో మాత్రం కుంబ్లేనే బెస్ట్ కెప్టెన్‌గా అతను కొనియాడాడు.

లాక్‌డౌన్ కారణంగా అన్ని రకాల క్రీడలపై పెను ప్రభావం పడింది. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వాయిదా పడగా.. అదే దారిలో మరికొన్ని టోర్నీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు తమ జీవితంలో జరిగిన ముఖ్యమైన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

తాజాగా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ఈ లిస్ట్‌లో చేరాడు. తన క్రికెట్ కెరీర్‌‌లోని టీమిండియా కెప్టెన్‌లలో అనిల్ కుంబ్లే అత్యుత్తమ సారథిగా గంభీర్ అభిప్రాయపడ్డాడు. రికార్డుల  పరంగా ధోనిలో టాప్‌లో ఉండొచ్చని కానీ తన దృష్టిలో మాత్రం కుంబ్లేనే బెస్ట్ కెప్టెన్‌గా అతను కొనియాడాడు.

దాదా గొప్పగా బాధ్యతలు నిర్వర్తించాడు.. అయితే ఒక ప్లేయర్ టీమిండియా కెప్టెన్‌గా చాలా కాలం పాటు ఉండాలని భావించానని.. అతనే కుంబ్లే. ఆయన కనుక కెప్టెన్సీ‌లో ఉండి ఉంటే ఎన్నో రికార్డులు బద్ధలు కొట్టేవాడని అభిప్రాయపడ్డాడు.

కాగా సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో టీమిండియాలోకి ఎంపికైన గౌతమ్ గంభీర్.. రాహుల్ ద్రావిడ్, కుంబ్లే, ధోనీ కెప్టెన్సీలో ఆడాడు. ఎంఎస్ ధోనీ నేతృత్వంలో టీ 20, వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన జట్టులో కూడా ఉన్నాడు. రెండు ఫైనల్లోనూ కీలక ఇన్నింగ్సులు ఆడాడు.

2007లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో కుంబ్లే నాయకత్వ పగ్గాలు అందుకున్నాడు. ఆ సమయంలో వన్డే, టీ 20లలో ధోనీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తన సుధీర్ఘ కెరీర్‌లో వన్డే (337), టెస్టుల్లో (619) అత్యథిక వికెట్లు తీసిన భారత  ఆటగాడిగా అనిల్ కుంబ్లే రికార్డుల్లోకి ఎక్కాడు. 14 టెస్టులకు సారథ్యం వహించిన అతను 2008లో రిటైర్మెంట్ ప్రకటించాడు. 

click me!