శిఖర్ ధావన్ గుండుపై ఎట్టకేలకు జుట్టు..!

Published : Jun 30, 2020, 10:03 AM ISTUpdated : Jul 13, 2020, 07:49 AM IST
శిఖర్ ధావన్ గుండుపై ఎట్టకేలకు జుట్టు..!

సారాంశం

ఈ ఇండియన్ ఓపెనర్ ఫన్నీ రంగురంగుల విగ్ ను ధరించిన ఫోటోను పోస్ట్ చేసాడు.

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్... సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తనకు ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. కాగా.. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అమలులో ఉండటంతో.. ఆటకు కూడా విరామం వచ్చింది. దీంతో.. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నాడు.

ఈ క్రమంలో సోమవారం ధావన్‌ షేర్‌ చేసిన పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.  ఈ ఇండియన్ ఓపెనర్ ఫన్నీ రంగురంగుల విగ్ ను ధరించిన ఫోటోను పోస్ట్ చేసాడు. ‘ఎట్టకేలకు కాస్త జుట్టు వచ్చింది’ అంటూ నెత్తి మీద విగ్గు లాంటి క్యాప్‌ పెట్టుకుని ఉన్న ధావన్‌ ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోకు ఇప్పటికే లక్షా ముప్పై వేలకు పైగా లైకులు రాగా.. ‘న్యూలుక్‌ అదిరింది బ్రో’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. 

 

ఇక ధావన్‌ నార్మల్‌ లుక్‌ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే!.. కాగా  2010లో అరంగేట్రం చేసిన శిఖర్‌ ధావన్‌ ఇప్పటి వరకు 136 వన్డేలు, 61 టి20 మ్యాచ్‌లు, 34 టెస్టులు ఆడాడు.  ఇటీవలే శిఖర్‌ ధావన్ పేరును బీసీసీఐ ‘అర్జున అవార్డు’ కోసం నామినేట్ చేసిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !