శార్దూల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కి అర్హుడు.. రోహిత్ శర్మ..!

By telugu news teamFirst Published Sep 7, 2021, 10:08 AM IST
Highlights

జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో.. రోహిత్ తో పాటు.. శార్దూల్ ఠాకూర్ కూడా అండగా నిలిచాడు. ఈ నేపథ్యంలో .. శార్దూల్ ఠాకూర్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్  కి అర్హుడు అని రోహిత్ శర్మ పేర్కొనడం గమనార్హం.
 

ఓవల్ టెస్టులో ఇంగ్లండ్‌పై 157 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా 50 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. మ్యాచ్‌లో చివరి రోజైన సోమవారం 368 పరుగుల ఛేదనలో తడబడిన ఇంగ్లండ్ టీమ్ 210 పరుగులకే కూప్ప కూలింది. 

భారత జట్టు విజయంలో ఓపెనర్ రోహిత్ శర్మ, బౌలర్లు ఉమేశ్ యాదవ్, బుమ్రా, జడేజా, శార్దూల్ ఠాకూర్ కీలక పాత్ర పోషించారు. దీంతో ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 తో ఆధిక్యం సాధించింది. 127 పరుగుల సాధించి టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించిన రోహిత్ శర్మకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

అయితే.. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో.. రోహిత్ తో పాటు.. శార్దూల్ ఠాకూర్ కూడా అండగా నిలిచాడు. ఈ నేపథ్యంలో .. శార్దూల్ ఠాకూర్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్  కి అర్హుడు అని రోహిత్ శర్మ పేర్కొనడం గమనార్హం.

ఈ మ్యాచ్ విజయం పట్ల తమకు ఎంతో సంతోషంగా ఉందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఈ సిరీస్ లో తాము పడిన కష్టం, కృషి కి ఇది నిదర్శనమన్నారు. ఇది అంతం కాదని.. మాంచెస్టర్ లో మరో మ్యాచ్ ఉందని.. ఆ విషయం తమకు తెలుసు అని రోహిత్ పేర్కొన్నాడు.

నాల్గవ టెస్ట్‌లో, శార్దూల్ రెండు ఇన్నింగ్స్‌లలో అర్ధ సెంచరీలు సాధించాడు. అతను ఇంగ్లండ్ పతనానికి, టీమ్ ఇండియా విజయానికి దారితీసిన రెండవ ఇన్నింగ్స్‌లో జో రూట్ సహా రెండు కీలక వికెట్లు తీశాడు.

"శార్దూల్ ఒక మ్యాచ్ గెలిచే ప్రయత్నం అని నేను అనుకున్నాను. నిజాయితీగా చెప్పాలంటే, అతను చేసిన ప్రదర్శనకు అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కు కూడా అర్హుడు. జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా జో రూట్ వికెట్ తీసి మరింత సహాయం చేశాడు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. 

"మేము అతని బ్యాటింగ్‌ని ఎలా మర్చిపోగలం, మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 31 బంతుల్లో 50 పరుగులు చేయడం, అతను తన బ్యాటింగ్‌ను ఇష్టపడతాడు. చాలా కష్టపడతాడు. నేను చాలా సంవత్సరాలుగా నేను అతనిని చూశాను’’ అంటూ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. 

click me!