2015 ప్రపంచకప్ లో పంటిబిగువున భరించిన బాధను బయటపెట్టిన షమీ

By Sree sFirst Published Apr 16, 2020, 2:00 PM IST
Highlights
భారత స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీ 2015 ప్రపంచ కప్ లో తన అనుభవాలను ఇర్ఫాన్ పఠాన్ తో ఇంస్టాగ్రామ్ లైవ్ సెషన్ లో పంచుకున్నాడు. 2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో జరిగిన ప్రపంచ కప్ తొలి మ్యాచ్ లోనే తన మోకాలికి గాయమైనట్టు చెప్పుకొచ్చాడు. 
కరోనా వైరస్ విస్తరిస్తున్న వేళ ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉంది. భారతదేశంలో కూడా ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు మరో 19 రోజులపాటు లాక్ డౌన్ ని పొడిగించిన విషయం తెలిసిందే! ఇక మనసెలెబ్రిటీలు అంతా ఈ ఖాళీ సమయంలో తమ అనుభవాలను పంచుకుంటూ ప్రజలతో సోషల్ మీడియా వేదికగా కనెక్ట్ అవుతూ, అందరిని ఇంటికే పరిమితమవ్వాలని సూచిస్తున్నారు. 

తాజాగా భారత స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీ 2015 ప్రపంచ కప్ లో తన అనుభవాలను ఇర్ఫాన్ పఠాన్ తో ఇంస్టాగ్రామ్ లైవ్ సెషన్ లో పంచుకున్నాడు. 2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో జరిగిన ప్రపంచ కప్ తొలి మ్యాచ్ లోనే తన మోకాలికి గాయమైనట్టు చెప్పుకొచ్చాడు. 

గాయంతో తాను బాధననుభవిస్తున్నప్పటికీ... టీం కోసం ఆడానని చెప్పుకొచ్చాడు. ప్రతిరోజు జట్టు డాక్టర్లు, ఫీజియో తనకు చికిత్సను అందించేవారని, దాదాపుగా రోజుకు మూడు పెయిన్ కిల్లర్లను వాడినట్టు షమీ చెప్పుకొచ్చాడు. 

ఆ కష్టకాలంలో ధోని తనకు పూర్తిగా అండగా ఉన్నాడని, ప్రతిరోజు తన పరిస్థితిని అడిగి తెలుసుకుంటేనే... తనలో ఎంతో ధైర్యాన్ని నింపేవాడని షమీ అన్నాడు. ఇక ఇలా ఇంతనొప్పితో 6 మ్యాచులు ఆడిన షమీ సెమీఫైనల్ కి ముందు జట్టు యాజమాన్యానికి తన వల్ల కావడం లేదని చెప్పాడట. 

ఆ సమయమ్లో ధోని వచ్చి తనలో స్ఫూర్తి నింపాడని, ఈ స్టేజి లో జట్టు వేరే బౌలర్ తో బరిలోకి దిగలేదని అన్నాడని అందుకని తాను నొప్పినంతా పంటిబిగువున భరించి మ్యాచ్ ఆడానని చెప్పుకొచ్చాడు. 

సెమీఫైనల్ లో షమీ తొలి 5 ఓవర్లలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అప్పటికే మరో సారి పెయిన్ కిల్లర్ కూడా తీసుకున్నాడు. ఆ తరువాత కూడా తన వాళ్ళ కాలేదని అప్పుడు ధోని దెగ్గరికి వెళ్ళిపోదామని చెబుతుంటే... ధోని ఇప్పుడు కొత్త బౌలర్ బౌలింగ్ చేసినా ధారాళంగా పరుగులు ఇవ్వడం తథ్యం అని కాబట్టి బౌలింగ్ వేసి 60 పరుగులు దాటకుండా చూడమని కోరాడట. 

అలా బౌలింగ్ చేసినప్పుడు మోకాలులోని ఎముక 4 అంగుళాల మేర విరిగిందని షమీ తెలిపాడు. ఆ తరువాత మరల క్రికెట్ ఆడతానని అనుకోలేదని, కానీ ఆడగల్గుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని షమీ చెప్పుకొచ్చాడు. 

ఆ మ్యాచ్ లో భారత్ 95 పరుగుల తేడాతో ఓటమి చెందిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 328 పరుగుల భారీ స్కోర్ చేయగా దానికి బదులుగా భరత్ కేవలం 233 పరుగులు మాత్రమే చేయగలిగింది. 
 
click me!