
బంగ్లా క్రికెటర్ షకీబ్ అల్‌హసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోపం వస్తే, అంపైర్లను కూడా కొట్టడానికి వెళ్లిపోయాడు షకీబ్. ఢాకా ప్రీమియర్ లీగ్‌లో ఇలా అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసి వార్తల్లో నిలిచిన షకీబ్ అల్ హసన్, తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నాడు...
బంగ్లాదేశ్‌కి టీ20 కెప్టెన్‌గా ఉన్న షకీబ్ అల్ హసన్, చిట్టగాంగ్‌లో జరిగిన ఓ ప్రమోషన్ ఈవెంట్‌కి హాజరయ్యాడు. షకీబ్ వస్తున్నాడని తెలియడంతో అతన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు.
అందులో ఓ అభిమాని, షకీబ్ అల్ హసన్ దగ్గరికి వెళ్లి, వెనక నుంచి అతని టోపీని తీసుకునేందుకు ప్రయత్నించాడు. దీన్ని గమనించిన షకీబ్ అల్ హసన్, వెంటనే తేరుకుని, అదే క్యాపుతో అతన్ని మూడు దెబ్బలేశాడు... ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది... అభిమానులు, తన ఫెవరెట్ క్రికెటర్ల సంతకాలతో పాటు క్యాపులను, జెర్సీలను మధుర జ్ఞాపకాలుగా దాచుకుంటారు. వాటిని చూసి తెగ ఉప్పొంగిపోతూ ఉంటారు...
చిట్టగాంగ్‌లో షకీబ్ అల్ హసన్ నుంచి క్యాప్ తస్కరించేందుకు ప్రయత్నించిన ఆ అభిమాని చేసింది కూడా ఇదే. అయితే షకీబ్ దీన్ని తట్టుకోలేకపోయాడు. తన క్యాప్ దొంగిలించేందుకు ప్రయత్నించిన అభిమానిపై తన ఆవేశాన్ని, కోపాన్ని చూపించాడు. షకీబ్ అల్ హసన్‌కి కోపం చాలా ఎక్కువ.
దీంతో చాలామంది అతన్ని ‘క్రికెట్ బాలయ్య’ అంటూ ఉంటారు. ఇప్పుడు ఆ పేరుని మరోసారి సార్థకం చేసుకున్నాడు షకీబ్ అల్ హసన్.. ఢాకా ప్రీమియర్ లీగ్‌లో అంపైర్‌తో గొడవ పడిన సంఘటన తర్వాత తీవ్ర దుమారం రేగింది. ఆ సంఘటన తర్వాత షకీబ్ అల్ హసన్ కూడా కాస్త కోపాన్ని తగ్గించుకున్నట్టు కనిపించాడు.
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ నో బాల్ కోసం అప్పీలు చేయడాన్ని ఖండించాడు షకీబ్ అల్ హసన్. అయితే చాలా కూల్‌గా మ్యాటర్‌ని ఢీల్ చేశాడు. ఐపీఎల్ 2023 సీజన్ మినీ వేలం మొదటి రౌండ్‌లో బంగ్లా టాప్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌ని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాలేదు. అయితే రెండో రౌండ్‌లో షకీబ్ అల్ హసన్‌ని బేస్ ప్రైజ్ రూ. కోటి 50 లక్షలకు కొనుగోలు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...
ఐపీఎల్‌లో 71 మ్యాచులు ఆడిన షకీబ్ అల్ హసన్, 19.82 సగటుతో 793 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 63 వికెట్లు పడగొట్టాడు.