షకిబ్ ఆల్ రౌండ్ షో.. మూడో వన్డేలో ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్..

Published : Mar 06, 2023, 07:53 PM IST
షకిబ్ ఆల్ రౌండ్ షో.. మూడో వన్డేలో ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్..

సారాంశం

BANvsENG: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ కు  మూడో వన్డేలో బంగ్లాదేశ్ చుక్కలు చూపించింది.ఆ జట్టు ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ ఆల్ రౌండ్ షో తో బట్లర్ గ్యాంగ్ తలవంచక తప్పలేదు. 

బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న  ఇంగ్లాండ్‌కు ఊహించని షాక్ తగిలింది. మోస్తారు లక్ష్య ఛేదనలో  ఇంగ్లాండ్.. బంగ్లా పులుల ముందు తలవంచింది.  చత్తోగ్రమ్  వేదికగా ముగిసిన మూడో వన్డేలో  బంగ్లాదేశ్ నిర్దేశించిన  247 పరుగుల లక్ష్య ఛేదనలో  ఇంగ్లాండ్..  196 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా బంగ్లాదేశ్.. 50 పరుగుల తేడాతో స్టన్నింగ్ విక్టరీ కొట్టింది.   బంగ్లా ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ ఆల్ రౌండ్ షో తో అదరగొట్టడమే గాక అరుదైన ఘనతను అందుకున్నాడు. 

ఇరు జట్ల మధ్య ముగిసిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన  బంగ్లాదేశ్  48.5 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో వికెట్ కీపర్ ముస్ఫీకర్ రహీమ్ (70), శాంతో  (53)లతో పాటు షకిబ్ అల్ హసన్ (75) రాణించారు.  ఇంగ్లాండ్ బౌలర్లలో  జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీయగా కరన్, రషీద్ లు తలా రెండు వికెట్లు తీశారు. 

ఇక లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌కు  ఓపెనర్లు ఫిఫ్టీ పార్ట్‌నర్ షిప్   జోడించారు.  జేసన్ రాయ్ (19), ఫిలిప్ సాల్ట్ (35) లు  క్రీజులో కుదురుకున్నట్టే కనిపించినా వీరిని షకిబ్ బోల్తా కొట్టించాడు.  షకిబ్ వేసిన  8వ ఓవర్లో  చివరి బంతికి రాయ్ ను బౌల్డ్ చేశాడు. తొలి వన్డే లో సెంచరీ చేసిన డేవిడ్ మలన్ (0) ను ఎబాదత్ హోసేన్  డకౌట్ చేశాడు.  షకీబ్..  10వ ఓవర్లో తొలి బంతికి జేసన్ రాయ్ ను ఔట్ చేశాడు.  కానీ  జేమ్స్ వీన్స్ (38), సామ్ కరన్ (23)  లు నాలుగో వికెట్ కు  49 పరుగులు జోడించారు. 

ఈ జోడీని  హసన్ మిరాజ్ విడదీశాడు.   వీన్స్ ను  షకిబ్  పెవిలియన్ కు పంపాడు.  కెప్టెన్ జోస్ బట్లర్ (26) ను తైజుల్ ఇస్లామ్ ఔట్ చేయగా .. మోయిన్ అలీని ఎబాదత్  బోల్తా కొట్టించాడు.   క్రిస్ వోక్స్ (34) పోరాడినా అతడిని ముస్తాఫిజుర్  పెవిలియన్ కు పంపాడు.  ఫలితంగా  ఇంగ్లాండ్.. 43.1 ఓవర్లలోనే  196 పరుగులకే ఆలౌట్ అయింది.  

మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లలో నెగ్గిన ఇంగ్లాండ్ సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుంది. వాస్తవానికి ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ గెలిచినా బంగ్లా పోరాటం ఆకట్టుకుంది. మూడో వన్డేలో గెలిచిన ఆ జట్టు.. తొలి వన్డేలో గెలిచినంత పనిచేసింది. డేవిడ్ మలన్ సాయంతో   బయటపడిందే గానీ  లేకుంటే ఆ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓటమిపాలయ్యేదే. ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ సిరీస్ గెలవకున్నా మూడో వన్డేలో ప్రపంచ నెంబర్ వన్ టీమ్ ను ఓడించి సంతృప్తి పొందింది. 

 

హసన్ అరుదైన ఘనత.. 

ఈ మ్యాచ్ లో  రెహన్ అహ్మద్ వికెట్ తీయడం ద్వారా బంగ్లాదేశ్ స్పిన్నర్ షకిబ్ అల్ హసన్ అరుదైన ఘనత సాధించాడు. వన్డేలలో షకిబ్ కు ఇది 300వ వికెట్. వన్డేలలో  బంగ్లాదేశ్ తరఫున 300 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా షకిబ్ చరిత్ర సృష్టించాడు. బంతితోనే గాక బ్యాట్ తో కూడా రాణించే షకిబ్ కు వన్డేలలో   6 వేల పరుగులున్నాయి.  తద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో 6 వేల పరుగులు చేసి  300 వికెట్లు తీసిన  మూడో ఆల్ రౌండర్ గా  షకిబ్.. సనత్ జయసూర్య, షాహిద్ అఫ్రిదిల తర్వాత నిలిచాడు. 

వన్డేలతో పాటు షకిబ్.. టెస్టు, టీ20లలో కూడా హయ్యస్ట్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. షకిబ్ ఇప్పటివరకు 65 టెస్టులు,  227 వన్డేలు, 109 టీ20 మ్యాచ్ లు ఆడాడు. టెస్టులలో 4,367 పరుగులు,  231 వికెట్లు తీశాడు. వన్డేలలో 6,976 రన్స్, 300 వికెట్లు సాధించాడు. టీ20లలో 2,243 రన్స్, 128 వికెట్లు తీశాడు. 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?