టీమ్ బస్సులో లైవ్ అప్‌డేట్స్... గోల గోల చేసిన తమిళనాడు జట్టు... వీడియో షేర్ చేసిన...

Published : Feb 19, 2021, 03:54 PM IST
టీమ్ బస్సులో లైవ్ అప్‌డేట్స్... గోల గోల చేసిన తమిళనాడు జట్టు... వీడియో షేర్ చేసిన...

సారాంశం

 షారుక్ ఖాన్‌ను రూ.5 కోట్ల 25 లక్షలకు దక్కించుకున్న పంజాబ్ కింగ్స్... విజయ్ హాజారే ట్రోఫీ 2021లో భాగంగా తమిళనాడు జట్టుతో ఉన్న షారుక్... వేలాన్ని మొబైల్‌లో లైవ్ వీక్షించిన తమిళనాడు జట్టు... 

ఐపీఎల్ వేలం 2021లో కొందరు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు కూడా లక్కీ ఛాన్స్ కొట్టేశారు. కృష్ణప్ప గౌతమ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.9 కోట్ల 25 లక్షల భారీ మొత్తానికి కొనుగోలు చేయగా, 25 ఏళ్ల యంగ్ ప్లేయర్ షారుక్ ఖాన్‌ను రూ.5 కోట్ల 25 లక్షలకు దక్కించుకుంది పంజాబ్ కింగ్స్.

షారుక్ ఖాన్ కోసం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. 18 ఏళ్ల వయసులో ఎంట్రీ ఇచ్చిన షారుక్ ఖాన్, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో అదరగొట్టాడు. మొదటి మ్యాచ్‌లోనే 8 బంతుల్లో 21 పరుగులు చేసిన షారుక్, మంచి పవర్ హిట్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

 

వేలం జరుగుతున్న సమయంలో విజయ్ హాజారే ట్రోఫీ కోసం తమిళనాడు టీమ్‌తో కలిసి బసులో వెళ్తున్నాడు షారుక్. షారుక్ వేలంలో కోట్లు దక్కించుకోవడాన్ని లైవ్‌లో వీక్షించిన సహచర జట్టు సభ్యులు, చప్పట్లు, విజిల్స్‌తో అతన్ని అభినందించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు తమిళనాడు కెప్టెన్ దినేశ్ కార్తీక్. 

PREV
click me!

Recommended Stories

T20 World Cup : వన్ మ్యాన్ ఆర్మీ కోహ్లీ నుంచి హిట్‌మ్యాన్ రోహిత్ దాకా.. ఈ లిస్ట్ చూస్తే గూస్‌బంప్స్ పక్కా !
Ravindra Jadeja : గెలిస్తే కింగ్.. లేదంటే ఇంటికే ! స్టార్ ప్లేయర్ కు బిగ్ టెస్ట్