ఐపీఎల్ లో కడప కుర్రాడికి చోటు..!

Published : Feb 19, 2021, 10:07 AM IST
ఐపీఎల్ లో కడప కుర్రాడికి చోటు..!

సారాంశం

హరిశంకర్‌ కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్. 2021 ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా గురువారం నిర్వహించిన వేలంలో ఈ యువకుడిని రూ.20 లక్షల కనీస ధరకు చెన్నై ఫ్రాంచైజీ దక్కించుకుంది.

ఐపీఎల్ 2021కు సంబంధించిన గురువారం వేలం జరిగిన సంగతి తెలిసిందేద. కాగా.. ఈ ఐపీఎల్ లో కడప కుర్రాడు ఒకరు చోటు దక్కించుకున్నాడు. కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం బోనమల పంచాయతీ నాగూరువాండ్లపల్లెకు చెందిన మారంరెడ్డి హరిశంకర్‌ రెడ్డి ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీలకు ఎంపికయ్యాడు. 

22 ఏళ్ల హరిశంకర్‌ కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్. 2021 ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా గురువారం నిర్వహించిన వేలంలో ఈ యువకుడిని రూ.20 లక్షల కనీస ధరకు చెన్నై ఫ్రాంచైజీ దక్కించుకుంది.

దీంతో మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, ఫాప్ డుఫ్లెసిస్, శార్దుల్ ఠాకూర్ వంటి అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునే అరుదైన అవకాశం హరిశంకర్‌కి దక్కినట్టయింది. ఇక బాహుబలి వచ్చిన గడ్డ నుంచి హరిశంకర్‌ వచ్చాడని సీఎస్‌కే టీమ్ అభివర్ణించింది. ఈమేరకు సీఎస్‌కే యాజమాన్యం ట్వీట్ చేసింది. ఇది వరకు కడప జిల్లాకే చెందిన పైడికాల్వ విజయ్ కుమార్‌కు కూడా ఐపీఎల్‌లో ఆడే అవకాశం లభించిన విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు