Virat Kohli: భద్రతను ఉల్లంఘించి గ్రౌండ్‌లోకి దూకి కోహ్లీని హగ్ చేసుకున్నాడు.. ఆ యువకుడి పరిస్థితి ఏమిటీ?

Published : Jan 15, 2024, 01:51 AM IST
Virat Kohli: భద్రతను ఉల్లంఘించి గ్రౌండ్‌లోకి దూకి కోహ్లీని హగ్ చేసుకున్నాడు.. ఆ యువకుడి పరిస్థితి ఏమిటీ?

సారాంశం

మధ్యప్రదేశ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఓ క్రికెట్ అభిమాని గ్యాలరీ ఫెన్స్ దాటి గ్రౌండ్‌లో దూకాడు. పరుగున వెళ్లి అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీని హగ్ చేసుకున్నాడు. భద్రతా సిబ్బంది వెంటనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు.  

IND vs AFG: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో భద్రతాపరమైన ఉల్లంఘన జరిగింది. టీమిండియా, ఆఫ్గనిస్తాన్‌ జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో టీమిండియా ఫీల్డింగ్ చేస్తుండగా ఓ యువకుడు గ్యాలరీని గ్రౌండ్‌కు వేరు చేస్తూ కట్టిన ఫెన్సింగ్‌ను ఎక్కి దాటేశాడు. గ్రౌండ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీని పరుగున వెళ్లి హగ్ చేసుకున్నాడు. వెంటనే సిబ్బంది ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. హోల్కర్ స్టేడియంలో ఈ ఘటన జరిగింది.

సిబ్బంది ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు అతడిని తుకోగంజ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ యువకుడు మ్యాచ్ వీక్షించడానికి టికెట్ తీసుకున్నాడు. నరేంద్ర హిర్వాని గేట్ గుండా స్టేడియం గ్యాలరీలోకి వెళ్లాడని పోలీసులు తెలిపారు.

ఆ యువకుడు విరాట్ కోహ్లీకి పెద్ద అభిమానుడై ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ఫెన్స్ ఎక్కి దూకి మరీ తన అభిమాన ఆటగాడిని కలుసుకునే సాహసం చేశాడు.  ఆ యువకుడిని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ దర్యాప్తు ఆధారంగా ఈ కేసులో తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. 

Also Read: KCR: బర్త్ డేకు కేసీఆర్ గ్రాండ్ ఎంట్రీ.. మళ్లీ రాజకీయంగా ఫుల్ జోష్‌లోకి మాజీ సీఎం.. వరుస కార్యక్రమాలతో బిజీ

ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్లతో ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా గెలిచింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !