IND vs AFG 2nd T20I: ఇండోర్ లోని హోల్కర్ క్రికెట్ స్టేడియం భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య 2వ టీ20 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. గుల్బాదిన్ నబీ 57 పరుగులతో రాణించాడు. అర్ష్ దీప్ సింగ్ 3 వికెట్లు తీసుకున్నాడు.
India vs Afghanistan 2nd T20: ఇండోర్ లోని హోల్కర్ క్రికెట్ స్టేడియం భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య 2వ టీ20 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ భారత్ ముందు 172 పరుగుల టార్గెట్ ఉంచింది. అఫ్ఘన్ టీమ్ 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. గుల్బాదిన్ నబీ 57 పరుగులతో రాణించాడు. నజీబుల్లా జద్రాన్ 23 పరుగులు, కరీం జనత్ 20, ముజీబ్ ఉర్ రెహమాన్ 21 పరుగులు చేశారు.
ఇక భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 3 వికెట్లు తీసుకున్నాడు. అలాగే, అక్షర్ పటేల్ 2, రవి బిష్ణోయ్ 2, శివం దుబే 1 వికెట్ తీసుకున్నాడు. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. మొదట బౌలింగ్ చేయడానికి ఎలాంటి కారణంగా లేదని చెప్పిన రోహిత్ శర్మ.. ఛేజింగ్ చేయడానికి గ్రౌండ్ అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నాడు. భారత్ ప్లేయర్లందరూ మెరుగ్గా రాణిస్తున్నారని చెప్పాడు. వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా భావిస్తున్నామని తెలిపారు. గెలవడం కీలకమని పేర్కొన్నాడు. శుభ్ మన్ గిల్, తిలక్ వర్మల ప్లేస్ లో విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ ను జట్టులోకి తీసుకున్నట్టు చెప్పాడు.
IND VS AFG: డబుల్ సెంచరీ వికెట్లు.. టీ20ల్లో అక్షర్ పటేల్ సరికొత్త రికార్డు..
జట్లు ఇవే..
భారత్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్ కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్.
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI):
రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, గుల్బాదిన్ నాయబ్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫరూకీ, నవీన్-ఉల్-జీబ్ హక్.
IND vs AFG: టీ20ల్లో ఒకే ఒక్కడు.. 150వ మ్యాచ్ తో రోహిత్ శర్మ సరికొత్త రికార్డు