బ్రేకింగ్... స్కాట్లాండ్ క్రికెటర్ కి కరోనా

By telugu news teamFirst Published Mar 21, 2020, 10:45 AM IST
Highlights

మొన్నటికి మొన్న కరోనా వైరస్ తో స్పానిచ్ లో ఓ ఫుట్ బాల్  కోచ్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా... ఇప్పుడు స్కాట్లాండ్ లో ఓ క్రికెటర్ కి ఈ మహమ్మారి సోకింది. సదరు క్రికెటర్ పాకీస్థానీయుడు కాగా... స్కాట్లాండ్ లో ఉంటున్నాడు.

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మొదట్లో దీనిని ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు కానీ.. ప్రస్తుతం మారుతున్న పరిస్థితులు చూస్తుంటే భయంతో వణికిపోతున్నారు.  చైనాలోని వుహాన్ లో తొలుత మొదలైన ఈ వైరస్ ఇప్పుు ప్రపచంలోని దాదాపు అన్ని దేశాలకు పాకేసింది. ఈ వైరస్ స్కాట్లాండ్ కి కూడా పాకేసింది.

Also Read కరోనా ఎఫెక్ట్.. ఇంట్లో బోర్ కొడుతుందా.. కేఎల్ రాహుల్ వీడియో...

మొన్నటికి మొన్న కరోనా వైరస్ తో స్పానిచ్ లో ఓ ఫుట్ బాల్  కోచ్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా... ఇప్పుడు స్కాట్లాండ్ లో ఓ క్రికెటర్ కి ఈ మహమ్మారి సోకింది. సదరు క్రికెటర్ పాకీస్థానీయుడు కాగా... స్కాట్లాండ్ లో ఉంటున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్ కి చెందిన మజిద్ హాక్  స్కాట్లాండ్ జట్టుకి ఆఫ్ స్పిన్నర్ గా సేవలందించాడు. 2006 నుంచి 2015 వరకు అంతర్జాతీయ క్రికెటర్ గా కొనసాగిన అతను 54 వన్డేలు, 24 టీ20 మ్యాచ్ లు ఆడాడు. ఇటీవల కరోనా వ్యాపించడంతో చికిత్స తీసుకుంటున్నాని ట్వీట్ చేశారు.గ్లాస్గోలోని రాయల్ అలెగ్జాండ్రియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పాడు.

‘ కరోనా వైరస్ సోకిందని తెలియగానే.. ఆస్పత్రిలో చేరాను. మెరుగైన చికిత్స తర్వాత ఆస్పత్రికి వెళ్తున్నాను. నా ఆరోగ్యం కోసం, నా క్షేమం కోసం మెసేజ్ చేసినవారందరికీ దన్యవాదాలు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తాను’ అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. 

2015 ప్రపంచకప్ లో చివరిసారి ఆడిన మజిద్ హాక్... గతేడాది వరకు స్కాట్లాండ్ తరపున అత్యధిక వన్డే వికెట్లు తీసిన బౌలర్ గా కొనసాగాడు.

click me!