ఇంట్లోనే ఉండండి... అభిమానులకు విరుష్క విన్నపం

Published : Mar 21, 2020, 08:36 AM IST
ఇంట్లోనే ఉండండి... అభిమానులకు విరుష్క విన్నపం

సారాంశం

 అందరి క్షేమం కోసం తామిద్దరం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటున్నామని తెలిపారు. అంతేకాదు ప్రజలంతా కూడా.. వీలైనంత వరకు స్వీయ నిర్బంధంలో ఉండాలని.. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని కోరారు.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ వైరస్ కారణంగా 8వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని లక్షల మంది వైరస్ సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండదని ప్రముఖులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు కూడా తమ అభిమానుల కోసం సందేశాన్ని ఇచ్చారు.

 

విరాట్ కోహ్లీతో కలిసి అతని భార్య అనుష్కశర్మ ఓ వీడియో తీసి తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోను కోహ్లీ రీ ట్వీట్ చేస్తూ.. తన అభిమానులకు ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ప్రస్తుతం మనమంతా విపత్కర పరిస్థులను ఎదుర్కొంటున్నామని.. ఈ కోరోనా వైరస్‌ను ఎదుర్కొవాలంటే.. ప్రజలంతా కలిసికట్టుగా ప్రభుత్వాదేశాలను పాటిస్తూ సహకరించాలని సూచించారు.

 అందరి క్షేమం కోసం తామిద్దరం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటున్నామని తెలిపారు. అంతేకాదు ప్రజలంతా కూడా.. వీలైనంత వరకు స్వీయ నిర్బంధంలో ఉండాలని.. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని కోరారు. అంతా ఇళ్లలోనే ఉంటూ ఆరోగ్యంగా ఉండి ఈ కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించాలని కోరారు.

కాగా.. దేశంలో కరోనా ప్రభావంతో ఇప్పటికే ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. మరో 200 వందల మందికి పైగా కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.

PREV
click me!

Recommended Stories

IND vs SA: ధర్మశాలలో అదరగొట్టిన భారత బౌలర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత
టీమిండియాలో నయా సంజూ శాంసన్.. పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న ఆరోన్ జార్జ్ ఎవరు?