కరోనా ఎఫెక్ట్.. ఇంట్లో బోర్ కొడుతుందా.. కేఎల్ రాహుల్ వీడియో

By telugu news teamFirst Published Mar 21, 2020, 9:00 AM IST
Highlights

ఇంట్లో ఎతంసేపని ఉంటాం.. బోర్ కొడుతుంది కదా.. అందుకే టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ కొన్ని సూచనలు చేస్తున్నాడు. ఇంట్లో ఒక్కరే ఉన్నా కూడా బోర్ కొట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి అంటూ సూచిస్తున్నాడు.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ వైరస్ కారణంగా 8వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని లక్షల మంది వైరస్ సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక దీని ప్రభావంతో చాలా మంది స్వీయనిర్భందంలో ఉండిపోతున్నారు. ప్రధాని మోదీ సైతం ఆదివారం జనతా కర్ఫ్యూ ప్రకటించారు.

సెలబ్రెటీలంతా ఇంట్లోనే ఉండండి... బటయకు రాకండి అంటూ తమ అభిమానులకు సలహాలు ఇస్తున్నారు. అయితే... ఇంట్లో ఎతంసేపని ఉంటాం.. బోర్ కొడుతుంది కదా.. అందుకే టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ కొన్ని సూచనలు చేస్తున్నాడు. ఇంట్లో ఒక్కరే ఉన్నా కూడా బోర్ కొట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి అంటూ సూచిస్తున్నాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Mask o̸f̸f̸ ON! #stayathomechallenge

A post shared by KL Rahul👑 (@rahulkl) on Mar 19, 2020 at 6:50am PDT

 

కాసేపు బాల్ ని తన బ్యాట్ తో కొడుకుతూ సరదాగా ఆడుకున్నాడు. మరి కాసేపు పుస్తకాలు చదివాడు. ఇంకోంచెం సేపు ల్యాప్ ట్యాప్ లో ఏవో వీడియోలు చూశాడు.. మరి కాసేపు వీడియో గేమ్స్ ఆడుకున్నాడు. వాటన్నింటినీ కలిపి ఓ వీడియో  చేసి.. తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. కాగా... ఇప్పుడు ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇదిలా ఉండగా.. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు తమను తాము స్వీయ నిర్భందం చేసుకున్నారు. అందులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. ఆయన తన భార్య అనుష్క తో కలిసి వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

click me!