‘గేల్ నీ కామెంట్స్ ఆపు, నిన్ను తీసేయడానికి కారణం ఇదే’

By telugu news teamFirst Published May 1, 2020, 12:38 PM IST
Highlights

కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో జమైకా తలవాస్ జట్టు నుంచి క్రిస్ గేల్ ని తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దానికి కోచ్ రామ్ నరేశ్ శర్వాణ్ కారణమంటూ గేల్ ఆరోపించాడు. 

వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ కి ఘెర పరాభవం ఎదురైంది. ఆయనను జట్టు నుంచి తీసేయడానికి చాలా కారణాలు ఉన్నాయంటూ జమైకా తలవాస్ పేర్కొంది. కోచ్ పై గేల్ చేసిన కామెంట్స్ పై జమైకా తలవాస్ మండిపడింది.

ఇంతకీ మ్యాటరేంటంటే.. కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో జమైకా తలవాస్ జట్టు నుంచి క్రిస్ గేల్ ని తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దానికి కోచ్ రామ్ నరేశ్ శర్వాణ్ కారణమంటూ గేల్ ఆరోపించాడు. అతను కరోనా కంటే ప్రమాదమని గేల్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.  పాము కంటే శర్వాణ్‌ చాలా విషపూరితమన్నాడు. 

వెన్నుపొటు పొడవడంలో రామ్‌ నరేశ్‌ సిద్ధ హస్తుడని విమర్శించాడు. ఈ వాఖ్యలను జమైకా తలవాస్‌ ఖండించింది. ఇక గేల్‌ తన వ్యాఖ్యలకు ఫుల్‌స్టాప్‌ పెడితే మంచిదని హెచ్చరించింది. ఒక ఆటగాడ్ని రీటైన్‌ చేసుకోవాలా.. వద్దా అనే విషయంలో ఫ్రాంచైజీతో పాటు సెలక్షన్‌ కమిటీ పాత్ర కూడా ఉంటుందనే విషయాన్ని గేల్‌ గ్రహించాలని చురకలంటించింది. ఇక్కడ గేల్‌ను తప్పించడంలో రామ్‌ నరేశ్‌ శర్వాణ్‌ పాత్ర ఏమీలేదని స్పష్టం చేసింది. బహిరంగ ప్రకటనలు చేసేముందు కాస్త సంయమనం పాటిస్తే మంచిదని గేల్‌కు హితబోధ చేసింది.

‘ గేల్‌ కాస్త తగ్గి మాట్లాడితే మంచిది. నిన్ను తీసివేయడానిక సవాలక్ష కారణాలున్నాయి. బహిరంగ విమర్శలు సరికాదు. నిన్నుతప్పించడంలో శర్వాణ్‌ పాత్ర ఏమీ లేదు. ఇక్కడ సెలక్షన్‌ కమిటీ ఉంది.. ఫ్రాంచైజీ కూడా ఉంది. నిన్నుఫ్రాంచైజీ కొనసాగించకూడదని నిర్ణయించుకుంది. దాంతో కొనసాగించలేదు. అంతే కానీ ఏ ఒక్కరూ నిన్ను తీసివేయడానికి కారణం కాదు’ అని తలవాస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

click me!