బౌండరీ దాటాల్సిన బంతిని.. సూపర్ క్యాచ్ పట్టిన సంజూ

Published : Apr 16, 2021, 08:11 AM ISTUpdated : Apr 16, 2021, 08:15 AM IST
బౌండరీ దాటాల్సిన బంతిని.. సూపర్ క్యాచ్ పట్టిన సంజూ

సారాంశం

బంతి ధావన్‌ బ్యాట్‌ను తాకుతూ సామ్సన్‌కు దూరంగా వెళ్లింది. అది వదిలేసి ఉంటే మాత్రం కచ్చితంగా బౌండరీ దాటేది.

ఐపీఎల్ 14వ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో గురువారం రాజస్థాన్ రాయల్స్ తలపడింది. కాగా.. ఈ మ్యాచ్ లో విజయం రాజస్థాన్ రాయల్స్ కే దక్కింది. ఢిల్లీని ఓడించి.. తొలి బోణీ కొట్టింది. కాగా... ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ సూపర్ క్యాచ్ తో మెరిశాడు. 

ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌లో ఉనాద్కట్‌ వేసిన బంతిని ధావన్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి ధావన్‌ బ్యాట్‌ను తాకుతూ సామ్సన్‌కు దూరంగా వెళ్లింది. అది వదిలేసి ఉంటే మాత్రం కచ్చితంగా బౌండరీ దాటేది. అయితే మెరుపు వేగంతో స్పందించిన సామ్సన్‌ ఒకవైపుగా డైవ్‌ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. సామ్సన్‌ అద్భుత క్యాచ్‌తో బిక్కమొహం వేసిన ధావన్‌ నిరాశగా పెవిలియన్‌ వైపు నడిచాడు.  

కాగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ సెంచరీతో చెలరేగిన సామ్సన్‌ ఆఖరివరకు నిలిచినా మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. ప్రస్తుతం 4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. కాగా ఈ మూడు వికెట్లు రాజస్తాన్‌ బౌలర్‌ జైదేవ్‌ ఉనాద్కట్‌ ఖాతాలో పడడం విశేషం.

 

PREV
click me!

Recommended Stories

కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?
టీ20ల్లో అట్టర్ ప్లాప్ షో.. అందుకే పక్కన పెట్టేశాం.. అగార్కర్ కీలక ప్రకటన