బుమ్రా సూపర్ ఓవర్ బౌలింగ్ పై మంజ్రేకర్ ట్వీట్ .. ఏకిపారేసిన నెటజన్లు

By telugu teamFirst Published Jan 31, 2020, 9:33 AM IST
Highlights

కాగా సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు.  నువ్వే ఓక యావరేజ్ ప్లేయర్ వి. ఇలాంటివి ఆపేస్తే మంచిది అంటూ ఓ నెటిజన్ కాస్త ఘాటుగానే స్పందించాడు. బుమ్రాకి చెప్పే స్థాయి నీది కాదు అనే అర్థం వచ్చేలా చాలా మంది కామెంట్స్ చేయడం గమనార్హం.
 

క్రికెట్ కామంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు.  జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ పై కామెంట్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు. ఇంతకీ మ్యాటరేంటంటే... ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్ తో టీ20 సిరీస్  కోసం తలపడుతున్న సంగతి తెలిసిందే. మూడో టీ20 మ్యాచ్ లో సూపర్ ఓవర్ తో టీమిండియా విజయం సాధించి సిరీస్ ని కైవసం చేసుకుంది.

సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ బాధ్యతలు రోహిత్ శర్మ తీసుకుంటే... బౌలింగ్ బాధ్యతలు జస్ప్రీత్ బుమ్రా తీసుకున్నాడు. కాగా... బుమ్రా బౌలింగ్ పై తాజాగా సంజయ్ మంజ్రేకర్ ఓ ట్వీట్ చేశాడు. ‘ సూపర్ ఓవర్ లో బుమ్రా బౌలింగ్ చేశాను.  చాలా అద్భుతమైన బౌలర్. కానీ అతను విభిన్న కోణాల్లో బౌలింగ్ వేయడానికి క్రీజ్ ని ఇంకా వాడుకోవాల్సి ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు.

Also Read కివీస్ క్రీడాస్ఫూర్తి... శెభాష్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

కాగా సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు.  నువ్వే ఓక యావరేజ్ ప్లేయర్ వి. ఇలాంటివి ఆపేస్తే మంచిది అంటూ ఓ నెటిజన్ కాస్త ఘాటుగానే స్పందించాడు. బుమ్రాకి చెప్పే స్థాయి నీది కాదు అనే అర్థం వచ్చేలా చాలా మంది కామెంట్స్ చేయడం గమనార్హం.

ఇదిలా ఉండగా సూపర్ ఓవర్ లో బుమ్రాకి బౌలింగ్  అవకాశం ఇవ్వడంపై రోహిత్ శర్మ కూడా స్పందించారు.   బుమ్రా టీమిండియాలో కీలకమైన బౌలర్ అని, అప్పుడు తమకు వేరే అవకాశం లేదని ఆయన చెప్పారు. ఒక సందర్భంలో షమీ, జడేజాలను పంపించాల్సిన విషయంపై సందిగ్ధత ఏర్పడిందని, అయితే కచ్చితమైన యార్కర్లు, స్లో బంతులు వేసే బుమ్రానే పంపించాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. 

ఇక బ్యాటింగ్ ఆ రోజు ఎవరు బాగా ఆడితే వారినే పంపిస్తారని, తాను ఆ మ్యాచులో 65 పరుగులు చేయకపోతే సూపర్ ఓవరులో బ్యాటింగ్ చేసేవాడిని కానని, తనకు బదులు శ్రేయస్ అయ్యర్ లేదా మరో బ్యాట్స్ మన్ బరిలోకి దిగేవాడని ఆయన చెప్పారు. 


 

click me!