అందుకే ఆయన్ని క్రికెట్ గాడ్ అనేది... గాయపడిన పక్షిని కాపాడిన సచిన్ టెండూల్కర్...

Published : Feb 27, 2022, 06:26 PM ISTUpdated : Feb 27, 2022, 06:50 PM IST
అందుకే ఆయన్ని క్రికెట్ గాడ్ అనేది... గాయపడిన పక్షిని కాపాడిన సచిన్ టెండూల్కర్...

సారాంశం

ముంబై బీచ్‌లో గాయపడిన పక్షిని చేరదీసి నీళ్లు తాపి, ఆహారం తినిపించిన సచిన్ టెండూల్కర్... ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో వైరల్...

‘మాస్టర్ బ్లాస్టర్’, ‘భారత రత్న’ సచిన్ టెండూల్కర్‌ని ‘క్రికెట్ గాడ్’ అని కూడా పిలుస్తారు. క్రికెట్ అనేది మతం అనేది, దానికి సచిన్ టెండూల్కర్ దేవుడు అంటూ క్రికెట్ దిగ్గజాలే చెప్పిన మాట. క్రికెట్‌లో వంద సెంచరీలు, వందల కొద్దీ రికార్డులు క్రియేట్ చేసిన సచిన్ టెండూల్కర్, క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్ తీసుకుని తొమ్మిదేళ్లు దాటింది...

అయితే ఆటకు సచిన్ దూరమైనా, అభిమానులకు మాత్రం ఆయన ఎప్పుడూ దగ్గరగానే ఉన్నాడు. అందుకే 2022 జనవరి నెలలో భారత్‌లో అత్యంత పాపులర్ క్రికెటర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు సచిన్ టెండూల్కర్...

భారత మాజీ సారథులు విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీ తర్వాత అత్యధిక పాపులర్ అయిన క్రికెటర్‌గా మూడో స్థానంలో నిలిచిన సచిన్ టెండూల్కర్, ప్రస్తుత సారథి రోహిత్ శర్మ, భావి సారథిగా చెప్పుకునే కెఎల్ రాహుల్ కంటే ముందున్నాడు...

తాజాగా బీచ్‌లో గాయపడిన పక్షిని కాపాడి, సోషల్ మీడియా జనాల మన్ననలు అందుకున్నాడు సచిన్ టెండూల్కర్. ముంబై బీచ్‌లో వాకింగ్‌కి వెళ్లిన సమయంలో సచిన్ టెండూల్కర్‌కి ఓ గాయపడిన పక్షి కనిపించింది...

వెంటనే దాన్ని చేతుల్లోకి తీసుకున్న సచిన్ టెండూల్కర్, దానికి నీళ్లు తాపి, ఆహారం కూడా పెట్టాడు. తర్వాత దాన్ని వైద్య నిపుణుడి దగ్గరికి తీసుకెళ్లి చూపించాడు. ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సచిన్ టెండూల్కర్... ‘కాసింత ప్రేమ, కొంచెం అప్యాయత మన ఇన్ని చిన్ని ప్రపంచాన్ని చాలా అద్భుతంగా మారుస్తాయంటూ’ రాసుకొచ్చాడు...

రిటైర్మెంట్ తర్వాత గత ఏడాది రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌ కోసం తిరిగి బ్యాటు పట్టిన సచిన్ టెండూల్కర్, కెప్టెన్‌గా భారత్‌కి టైటిల్ కూడా అందించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022 సీజన్ ప్రారంభం అవుతుందని ప్రచారం జరిగినా, అది కార్యరూపం దాల్చలేదు. 

సచిన్ టెండూల్కర్‌ సహచర క్రికెటర్లు సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా, రాహుల్ ద్రావిడ్ టీమిండియా హెడ్ కోచ్‌గా, వీవీఎస్ లక్ష్మణ్ జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బీసీసీఐ బాస్‌గా ఉన్న సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్‌ని కూడా భారత క్రికెట్ బోర్డులో భాగం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే మాస్టర్ సచిన్ మాత్రం క్రికెట్‌కి, భారత జట్టుకి దూరంగా ప్రశాంతమైన వ్యక్తిగత జీవితాన్ని గడపాలని నిర్ణయం తీసుకున్నాడట...

24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌ను కొనసాగించిన సచిన్ టెండూల్కర్, వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన మొట్టమొదటి క్రికెటర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు. అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు, అత్యధిక ఫోర్లు... ఇలా సచిన్ టెండూల్కర్ క్రియేట్ చేసిన రికార్డుల్లో చాలా వరకూ ఇప్పటివరకూ ఆయన పేరిటే పదిలంగా ఉన్నాయి. సచిన్ 100 సెంచరీల రికార్డును ఈజీగా అధిగమిస్తాడని భావించిన భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ, రెండున్నరేళ్లుగా 71వ సెంచరీని అందుకోవడానికి ఆపసోపాలు పడుతున్న విషయం తెలిసిందే...

PREV
click me!

Recommended Stories

T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !
Indian Cricket: టెస్టుల్లో 300, వన్డేల్లో 200, ఐపీఎల్‌లో 100.. ఎవరీ మొనగాడు?