సచిన్ టెండూల్కర్ ఫ్రెండ్ కు షాకిచ్చిన సైబర్ మోసగాళ్లు.. బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు మాయం..

Published : Dec 11, 2021, 03:44 PM IST
సచిన్ టెండూల్కర్ ఫ్రెండ్ కు షాకిచ్చిన సైబర్ మోసగాళ్లు.. బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు మాయం..

సారాంశం

Vinod Kambli: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీ సైబర్ మోసానికి గురయ్యాడు.  సైబర్ మోసగాళ్ల వలలో చిక్కిన కాంబ్లీ.. డబ్బులు  పోగొట్టుకుని పోలీసులను ఆశ్రయించాడు. 

ఆన్ లైన్ మోసాలు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ తరహా నేరాలపై సామాన్య ప్రజానీకానికే కాదు.. సెలబ్రిటీలకు కూడా అవగాహన లేకపోవడంతో  వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా  టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీ సైబర్ మోసానికి గురయ్యాడు.  సైబర్ మోసగాళ్ల వలలో చిక్కిన కాంబ్లీ.. లక్ష పదిహేను వేల రూపాయలు  పోగొట్టుకున్నారు. బ్యాంకు అధికారినని చెప్పిన సదరు  మోసగాడు.. కాంబ్లీని బురిడీ కొట్టించి అతడి బ్యాంకు నుంచి డబ్బు మాయం చేశాడు. అయితే సమయానికి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కాంబ్లీకి పెద్ద ముప్పు తప్పింది. 

నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బాంద్రాలో ఉంటున్న కాంబ్లీకి మంగళవారం  ఓ వ్యక్తి కాల్ చేశాడు.  తాను బ్యాంక్ అధికారినని, కేవైసీ వివరాలు అప్డేట్ చేయాలని, లేకుంటే అతడి డెబిట్,  క్రెడిట్ కార్డు బ్లాక్ అయే ప్రమాదం ఉందని చెప్పాడు. దీంతో అది నమ్మిన కాంబ్లీ.. అతడు చెప్పినట్టు చేశాడు. తన ఫోన్ లో గూగుల్ యాప్స్ నుంచి ‘ఎనీ డెస్క్’ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నాడు. 

అంతే.. కాంబ్లీ బ్యాంక్ అకౌంట్ నుంచి పలు దఫాలుగా రూ. 1.14 లక్షల డబ్బు స్వాహ అయింది. ఇది మరో అకౌంట్ కు బదిలీ అయింది. సదరు నేరగాడు.. ఎనీ డెస్క్ ద్వారా  కాంబ్లీ ఫోన్ ను ఆపరేట్ చేస్తూ.. అతడి బ్యాంక్ లో ఉన్న  సొమ్మును కాజేశాడు. ఇదంతా కాంబ్లీ ఫోన్ లో మాట్లాడుతుండగానే జరుగడం విశేషం. 

ఫోన్ పెట్టేసిన తర్వాత కాంబ్లీ.. తనకు వచ్చిన మెసేజ్ లను చూసుకుని లబోదిబోమన్నాడు.  వివిధ ఖాతాల నుంచి సొమ్ము ఇతర అకౌంట్లకు ట్రాన్స్ఫర్ కావడంతో అతడు దగ్గర్లోనే ఉన్న బాంద్రా పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాడు. దీనిపై ఫిర్యాదు తీసుకున్న సైబర్ పోలీసులు.. రివర్స్  ట్రాన్సక్షన్ ద్వారా తిరిగి ఆయన డబ్బును  ఆయన ఖాతాలోకి జమచేయడంతో కాంబ్లీ ఊపిరిపీల్చుకున్నాడు. 

సచిన్ టెండూల్కర్ తో కలిసి కాంబ్లీ చదువుకున్నాడు. ఈ ఇద్దరూ కలిసి స్కూల్ లో ఉండగా.. సెయింట్ గ్జేవియర్స్ స్కూల్ పై ఏకంగా 664 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇందులో కాంబ్లీ వాటా 349 పరుగులు. వీరి గురువు రమాకాంత్ అచ్రేకర్.. ‘ఇక చాలురా బాబు.. రండి..’ అనేదాకా ఈ ఇద్దరూ బ్యాటింగ్ చేసి ఆ తర్వాత డిక్లేర్ చేశారు. బ్యాటింగ్  లో రాణించిన కాంబ్లీ.. అదే మ్యాచ్ లో బౌలింగ్ లో కూడా 37 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు.  ఆ తర్వాత రంజీల ద్వారా భారత క్రికెట్ లోకి అడుగుపెట్టిన కాంబ్లీ.. టీమిండియా తరఫున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. పలు వివాదాల కారణంగా కాంబ్లీ జట్టు నుంచి  తప్పుకున్నాడు.

PREV
click me!

Recommended Stories

Cricketers Assault : ఎంతకు తెగించార్రా..గ్రౌండ్ లోనే క్రికెట్ కోచ్‌ తల పగలగొట్టిన ప్లేయర్స్ !
IPL Brand Value: ఐపీఎల్ జట్లకు బిగ్ షాక్.. సన్‌రైజర్స్, ఆర్సీబీ బ్రాండ్ విలువ ఢమాల్ ! కష్టమేనా?