నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది.. కూతురిపై సచిన్ ఎమోషనల్ పోస్ట్..!

Published : Sep 27, 2021, 11:06 AM ISTUpdated : Sep 27, 2021, 11:24 AM IST
నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది..  కూతురిపై సచిన్ ఎమోషనల్ పోస్ట్..!

సారాంశం

ఆయన తన ముద్దుల కుమార్తె సారా టెండుల్కర్ తో చిన్న తనంలో దిగిన ఓ ఫోటోని  సచిన్ షేర్ చేశారు. ఆ ఫోటో సారా చిన్నతనంలో దిగిన ఫోటో  కాగా.. సారాని ఒడిలో కూర్చోపెట్టుకొని సచిన్ ఆడిస్తున్నట్లుగా ఆ ఫోటో ఉండటం గమనార్హం.

ప్రతి సంవత్సరం  సెప్టెంబర్ లో వచ్చే చివరి ఆదివారాన్ని.. ప్రపంచవ్యాప్తంగా కూతుళ్ల దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 26వ తేదీన డాటర్స్ డే వచ్చింది.  కాగా.. ఈ డాటర్స్ డే సందర్భంగా.. క్రికెట్ దిగ్గజం,  లెజెండ్ సచిన్ టెండుల్కర్ ఎమోషనల్ పోస్టు పెట్టారు.

ఆయన తన ముద్దుల కుమార్తె సారా టెండుల్కర్ తో చిన్న తనంలో దిగిన ఓ ఫోటోని  సచిన్ షేర్ చేశారు. ఆ ఫోటో సారా చిన్నతనంలో దిగిన ఫోటో  కాగా.. సారాని ఒడిలో కూర్చోపెట్టుకొని సచిన్ ఆడిస్తున్నట్లుగా ఆ ఫోటో ఉండటం గమనార్హం.

‘నువ్వు చుట్టూ ఉన్నప్పుడు సమయం వెంటనే గడిచిపోతుంది.. నా ఒడిలో  ఆడుకున్న చిన్నారి.. ఇప్పుడు అందమైన యువతిగా మారింది. నిన్ను  చూసి నేను ఎప్పుడూ గర్వపడుతూనే ఉంటాను’ హ్యాపీ ఇంటర్నేషనల్ డాటర్స్ డే. అంటూ... సచిన్ పోస్టు షేర్ చేశారు. కాగా.. దానిని సారా కూడా స్పందించింది. లవ్ యూ అంటూ తన తండ్రి పోస్టుకి రిప్లే ఇచ్చింది. పక్కన రెండు హృదయాకార ఎమోజీలను కూడా పెట్టడం విశేషం. కాగా ఈ ఫోటో, పోస్టు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

PREV
click me!

Recommended Stories

ఐపీఎల్ ముద్దు.. హనీమూన్ వద్దు.. నమ్మకద్రోహం చేసిన ఆసీస్ ప్లేయర్.. పెద్ద రచ్చ జరిగేలా ఉందిగా
విదేశీ లీగ్‌ల్లో ఆడనున్న రో-కో.. ఐపీఎల్ చైర్మన్ ఏమన్నారంటే.?