IPL2021 RCB vs MI: హర్షల్ పటేల్ హ్యాట్రిక్... ముంబై ఇండియన్స్‌పై రికార్డు ఫీట్...

By Chinthakindhi RamuFirst Published Sep 26, 2021, 11:11 PM IST
Highlights

వరుసగా మూడు బంతుల్లో హార్ధిక్ పాండ్యా, కిరన్ పోలార్డ్, రాహుల్ చాహార్‌లను అవుట్ చేసిన హర్షల్ పటేల్...

పర్పుల్ క్యాప్ హోల్డర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్, ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో మొట్టమొదటి హ్యాట్రిక్ నమోదుచేశాడు... 17వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన హర్షల్ పటేల్, వరుసగా హార్ధిక్ పాండ్యా, కిరన్ పోలార్డ్, రాహుల్ చాహార్ వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదుచేశాడు..

ఐపీఎల్ చరిత్రలో ఆర్‌సీబీ తరుపున 2010లో ప్రవీణ్ కుమార్, 2017లో శ్యామూల్ బాద్రే తర్వాత హ్యాట్రిక్ తీసిన బౌలర్‌గా మూడో బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు హర్షల్ పటేల్.. ఫస్టాఫ్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన హర్షల్ పటేల్, సెకండాఫ్‌లో హ్యాట్రిక్ తీసి అదరగొట్టాడు...

ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన ఆర్‌సీబీ, ఎట్టకేలకు అవసరమైన విజయాన్ని అందుకుంది. డిఫెడింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మాత్రం, ఐపీఎల్ 2021 సీజన్‌ ఫేజ్ 2లో హ్యాట్రిక్ పరాజయాలను మూటకట్టుకుంది...

166 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై ఇండియన్స్‌కి ఓపెనర్లు శుభారంభం అందించారు... 6 ఓవర్లలోనే 50+  పరుగులను దాటిన ముంబై ఇండియన్స్... 23 బంతుల్లో 4 ఫోర్లతో 24 పరుగులు చేసిన డి కాక్, 28 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 43 పరుగులు చేసిన రోహిత్ శర్మ అవుటైన తర్వాత వరుస వికెట్లు కోల్పోయి 111 పరుగులకి ఆలౌట అయ్యింది...

click me!