ఇంటికి తిరిగొచ్చిన సచిన్ టెండూల్కర్... అయితే ఇప్పటికీ...

Published : Apr 08, 2021, 06:34 PM ISTUpdated : Apr 08, 2021, 06:40 PM IST
ఇంటికి తిరిగొచ్చిన సచిన్ టెండూల్కర్... అయితే ఇప్పటికీ...

సారాంశం

రోడ్ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో పాల్గొన్న తర్వాత కరోనా బారిన పడిన సచిన్ టెండూల్కర్... ఆరు రోజులకు పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరిన మాస్టర్... ఆరోగ్యం కుదటపడడంతో మళ్లీ ఇంటికి... 

‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ అభిమానులకు శుభవార్త తెలిపారు. కరోనా బారిన పడిన తర్వాత గత వారం ఆసుపత్రిలో చేరిన సచిన్ టెండూల్కర్, ఇంటికి తిరిగొచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు ‘మాస్టర్ బ్లాస్టర్’. 

ఇండియా లెజెండ్స్ తరుపున రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొన్న సచిన్ టెండూల్కర్, ఆ తర్వాత మార్చి 22న కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు ప్రకటించారు. కరోనా బారిన 6 రోజులకు ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరిన సచిన్ టెండూల్కర్, కోలుకుని ఇంటికి తిరిగొచ్చారు.

 

అయితే సచిన్ టెండూల్కర్‌కి ఇంకా కరోనా నెగిటివ్ రాలేదు. దీంతో ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండబోతున్నట్టు ప్రకటించారు సచిన్ టెండూల్కర్. సచిన్‌తో పాటు రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొన్న యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, బద్రీనాథ్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

5 Wickets in 1 Over : W, W, W, W, W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ కొత్త చరిత్ర
Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !