ఐసీసీ మంత్లీ ప్లేయర్ అవార్డు రేసులో భువనేశ్వర్ కుమార్... మహిళా విభాగంలో ఇద్దరు ఇండియన్స్...

Published : Apr 08, 2021, 02:57 PM IST
ఐసీసీ మంత్లీ ప్లేయర్ అవార్డు రేసులో భువనేశ్వర్ కుమార్... మహిళా విభాగంలో ఇద్దరు ఇండియన్స్...

సారాంశం

ఇంగ్లాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లో అదరగొట్టిన భువనేశ్వర్ కుమార్... రషీద్ ఖాన్, విండీస్ బ్యాట్స్‌మెన్ సీన్ విలియమ్స్‌తో పోటీపడనున్న భువీ.. మహిళల విభాగంలో టీమిండియా నుంచి ఇద్దరు ప్లేయర్లు... 

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ - మార్చి రేసులో భువనేశ్వర్ కుమార్ నిలిచాడు. మార్చి నెలలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చిన భువనేశ్వర్ కుమార్ 6 వన్డే వికెట్లు, 4 టీ20 వికెట్లు పడగొట్టాడు. అతనితో పాటు విండీస్ బ్యాట్స్‌మెన్ సీన్ విలియమ్స్ గత నెలలో టెస్టుల్లో రెండు సెంచరీలతో 264 పరుగులు, రషీద్ ఖాన్ 11 టెస్టు వికెట్లు, ఆరు టీ20 వికెట్లతో నామినేషన్లలో నిలిచారు.

 

ఈ ఏడాది ప్రారంభంలో మొదలెట్టిన ఈ మంత్లీ అవార్డులు ఇప్పటిదాకా భారత ప్లేయర్లకే దక్కాయి. జనవరి నెలలో రిషబ్ పంత్, ఫిబ్రవరిలో రవిచంద్రన్ అశ్విన్ ఈ అవార్డు గెలిచారు. మహిళా క్రికెటర్ల నామినేషన్లలో మొదటిసారి ఇద్దరు టీమిండియా ప్లేయర్లు రేసులో నిలిచాడు.

సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో 8 వన్డే వికెట్లు, 4 టీ20 వికెట్లు తీసిన రాజేశ్వరి గైక్వాడ్, 263 పరుగులు చేసిన పూనమ్ రౌత్‌తో పాటు సఫారీ బ్యాట్స్‌‌వుమెన్ 288 వన్డే పరుగులు, 90 టీ20 పరుగులతో నామినేషన్లలో నిలిచారు.  

PREV
click me!

Recommended Stories

5 Wickets in 1 Over : W, W, W, W, W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ కొత్త చరిత్ర
Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !