శ్రేయాస్ అయ్యర్‌ చేతికి సర్జరీ సక్సెస్... గర్జించే సింహంలా దూసుకొస్తానంటూ...

Published : Apr 08, 2021, 05:17 PM ISTUpdated : Apr 08, 2021, 05:24 PM IST
శ్రేయాస్ అయ్యర్‌ చేతికి సర్జరీ సక్సెస్... గర్జించే సింహంలా దూసుకొస్తానంటూ...

సారాంశం

ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన శ్రేయాస్ అయ్యర్.. అయ్యర్ ఎడమ చేతి ఎముక పక్కకు జరిగిందని తేల్చిన వైద్యులు, శస్త్రచికిత్స పూర్తి...

ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన భారత బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌కి శస్త్రచికిత్స పూర్తయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేసిన శ్రేయాస్ అయ్యర్... త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తానంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు.

‘సర్జరీ సక్సెస్ అయ్యింది. గర్జించే సింహాంలా నేను మళ్లీ జట్టులోకి తిరిగొస్తా... మీ అందరి అభిమానానికి థ్యాంక్స్’ అంటూ కామెంట్ చేశాడు శ్రేయాస్ అయ్యర్. టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా టీ20, వన్డేల్లో అద్భుతంగా రాణిస్తున్న శ్రేయాస్ అయ్యర్, ఇంగ్లీష్ కంట్రీ క్లబ్ లాంక్యాషేర్ తరుపున ఆడతానని ప్రకటించాడు.

 

జూలై 23న ప్రారంభమయ్యే రాయల్ వన్డే కప్ టోర్నీ నాటికి శ్రేయాస్ అయ్యర్ కోలుకుంటాడా? లేదా? తెలియాల్సి ఉంది. గాయం కారణంగా ఐపీఎల్ సీజన్ మొత్తానికి శ్రేయాస్ అయ్యర్ దూరం కావడంతో అతని స్థానంలో యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ రిషబ్ పంత్‌కి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ పగ్గాలు దక్కిన విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

5 Wickets in 1 Over : W, W, W, W, W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ కొత్త చరిత్ర
Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !