పెద్ద మనసు చాటుకున్న సచిన్... తన బ్యాట్లు బాగుచేసిన వృద్ధుడికి సాయం

By Siva KodatiFirst Published Aug 26, 2020, 2:36 PM IST
Highlights

టీమిండియా దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పెద్ద మనసు చాటుకున్నారు. బ్యాట్ల తయారీ దుకాణం నిర్వహించే అష్రఫ్ చౌదరీ అనే పెద్దాయనను ఆర్ధికంగా ఆదుకున్నారు. 

టీమిండియా దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పెద్ద మనసు చాటుకున్నారు. బ్యాట్ల తయారీ దుకాణం నిర్వహించే అష్రఫ్ చౌదరీ అనే పెద్దాయనను ఆర్ధికంగా ఆదుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. కరోనా లాక్‌డౌన్‌తో వ్యాపారం సాగకపోవడంతో అష్రఫ్ చాచాను తీవ్ర ఆర్ధిక కష్టాలు చుట్టుముట్టాయి. దాంతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతింది. 12 రోజుల క్రితం ముంబైలోని సాల్వా ఆసుపత్రిలో చేరాడు.

ఈ విషయం తెలుసుకున్న సచిన్ ఆసుపత్రికి వచ్చి చాచాను పరామర్శించాడు. అంతేకాదు హాస్పిటల్ ఖర్చులు భరించడంతో పాటు, ఆర్ధిక సాయం కూడా చేశాడు. విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, క్రిస్‌గేల్, కీరన్ పొలార్డ్ బ్యాట్లను కూడా అష్రఫ్ బాగు చేసేవాడు.

క్రికెట్ అంటే ఆయనకు ప్రాణం... ఎంతోమంది యువ క్రికెటర్ల వాడుకునే బ్యాట్లు పాడైపోతే  ఉచితంగా సరిచేసి ఇచ్చేవాడు. ముఖ్యంగా ముంబై వాంఖడే స్టేడియంలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఐపీఎల్ మ్యాచ్‌లు క్రమం తప్పకుండా వీక్షించేవాడు. ఇదే సమయంలో సచిన్ పాడైన బ్యాట్లను అష్రఫ్ బాగుచేసేవాడు. 

click me!