బీజేపీలోకి టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ..?

By team teluguFirst Published Aug 24, 2020, 9:01 AM IST
Highlights

బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ టీమిండియా కెప్టెన్ గంగూలీ రాజకీయ ఎంట్రీపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆయన తాజా చర్య ఈ దిశగా గంగూలీ ఆలోచనలు సాగుతున్నాయా అనే అనుమానాలకు తావిస్తోంది. 

వచ్చే సంవత్సరం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ టీమిండియా కెప్టెన్ గంగూలీ రాజకీయ ఎంట్రీపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆయన తాజా చర్య ఈ దిశగా గంగూలీ ఆలోచనలు సాగుతున్నాయా అనే అనుమానాలకు తావిస్తోంది. 

రెండు సంవత్సరాల కింద మమతా సర్కార్ గంగూలీకి కోల్కతా లోని సాల్ట్ లేక్ ప్రాంతంలో స్కూల్ నిర్మించడానికి రెండెకరాల స్థలాన్ని ఇచ్చింది. రెండు రోజుల కింద గంగూలీ ఆ స్థలాన్ని తిరిగి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఇచ్చేసారు. 

పశ్చిమ బెంగాల్ లో ఎలాగైనా జెండా పతాలని తీవ్ర తాపత్రయపడుతున్న బీజేపీ... అక్కడ మమతాబెనర్జీ ని ధీటుగా ఎదుర్కోగలిగే పాపులర్ వ్యక్తి కోసం అన్వేషిస్తుంది. సౌరవ్ గంగూలీ ఎప్పుడైతే బీసీసీఐ అదేక్షుడయ్యాడో అప్పటినుండి గంగూలీ... బెంగాల్ బీజేపీ సీఎం అభ్యర్థి అని వార్తలు మొదలయ్యాయి. 

గంగూలీకి మమతా బెనర్జీతోకూడా సత్సంబంధాలు ఉన్నాయి. క్రికెట్ అసోసియేషన్ అఫ్ బెంగాల్ కి గంగూలీ అధ్యక్షుడయ్యాడంటే... మమత వల్లనే. మమతా హయాంలోనే గంగూలీ ఆ పదవిని అలంకరించాడు. 

గంగూలీ మాత్రం తాను రాజకీయాల్లో చేరుతున్నానని వచ్చే వార్తల్లో వాస్తవం లేదని పలుమార్లు ప్రకటించాడు. చాలాసార్లు ఇలాంటి ఊహాగానాలను తోసిపుచ్చారు. ఇప్పుడు ఈ స్థలం వెనక్కి ఇవ్వడంలో కూడా రాజకీయ కోణం లేదని, కొన్ని చట్టపరమైన ఇబ్బందులు ఉన్నందువల్లనే ఈ భూమిని తిరిగి ఇచ్చేసినట్టు గంగూలీ సన్నిహితవర్గాలు అంటున్నాయి. 

రెండు సంవత్సరాల కింద ఈ భూమి గంగూలీకి అప్పగించినప్పటికీ... అక్కడ స్కూల్ కడదామంటే... న్యాయపరమైన చిక్కులు తలెత్తాయని, ఆ భూమిని పూర్తిస్థాయిలో గంగూలీ స్వాధీన పరుచుకోలేకపోయాడని వారు అంటున్నారు. 

గంగూలీ స్థలాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్టు లేఖ రాసాడని ప్రభుత్వం ధృవీకరించింది. చూడాలి, ఇదొక రాజకీయ వదంతిగా మిగిలిపోద్ధో, లేదా నిజంగానే ఈ కోల్కతా ప్రిన్స్ రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేస్తారో..!

click me!