బ్యాటింగ్ చేస్తుంటే.. భయమేస్తోంది.. కేఎల్ రాహుల్ షాకింగ్ కామెంట్స్

By telugu news teamFirst Published Aug 26, 2020, 10:03 AM IST
Highlights

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కూడా 5 రోజుల క్రితమే దుబాయ్ చేరుకుంది. ఇదంతా బాగానే ఉన్నా జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం తెగ భయపడిపోతున్నాడు. తన బ్యాటింగ్‌కు సంబంధించి పీడకలలు వస్తున్నాయని వాపోతున్నాడు. 

కరోనా మహమ్మారి కారణంగా క్రీడా ప్రపంచమంతా స్థంభించిపోయింది.  ఇంతకాలం క్రీడీకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే.. ఐపీఎల్ పుణ్యమాన.. ఇప్పుడిప్పుడే ఇంట్లో నుంచి బయటకు అడుగుపెడుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే క్రికెటర్లంతా దుబాయి  చేరుకున్నారు.

కాగా.. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కూడా 5 రోజుల క్రితమే దుబాయ్ చేరుకుంది. ఇదంతా బాగానే ఉన్నా జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం తెగ భయపడిపోతున్నాడు. తన బ్యాటింగ్‌కు సంబంధించి పీడకలలు వస్తున్నాయని వాపోతున్నాడు. 

‘లాక్‌డౌన్ తరువాత ప్రాక్టీస్ ప్రారంభించాను. అయితే మునుపటిలా బ్యాటింగ్ చేయలేకపోతున్నానేమోనని భయంగా ఉంది. దీనికి తోడు రెండు రోజుల నుంచి తెగ పీడకలలొస్తున్నాయి. ఉదయం లేవగానే ఎక్కడ లేని భయాలు మొదలవుతున్నాయి. బంతిని సక్రమంగా అంచనా వేయలేకపోతే ఎలా..? నా బ్యాటింగ్ స్లో అయిపోయానేమో.. మునుపటిలా కవర్ డ్రైవ్ ఆడగలనా..? ఇలాంటి ఆలోచనలన్నీ వస్తున్నాయ’ని రాహుల్ పేర్కొన్నాడు. 

ఇదిలా ఉంటే పంజాబ్ జట్టు గురువారమే యూఏఈ చేరుకుంది. ఆటగాళ్లంతా తమ హోటల్ గదుల్లోనే క్వారంటైన్ పాటిస్తున్నారు. 6 రోజుల వరకు ఈ క్వారంటైన్ కొనసాగనుంది. అనంతరం ప్రాక్టీస్ ప్రారంభిస్తారు

click me!