SA vs IND: చతికిలపడ్డ టీమిండియా.. 211 పరుగులకే ఆలౌట్

By Mahesh K  |  First Published Dec 19, 2023, 8:12 PM IST

తొలి వన్డేను నెగ్గిన భారత్.. రెండో వన్డేను పేలవమైన ప్రదర్శనతో మొదలు పెట్టింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ 46.2 ఓవర్లకే 211 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇద్దరు హాఫ్ సెంచరీలు తప్పితే.. మిగిలిన బ్యాట్స్‌మెన్లు ఎవరూ కనీసం 20 పరుగులు కూడా చేయలేదు.
 


Cricket News: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తొలి ఓవర్ నుంచి దూకుడు ప్రదర్శించింది. ఫస్ట్ ఓవర్ నుంచే టీమిండియా బ్యాట్స్‌మెన్‌లకు కళ్లెం వేసింది. తొలి ఓవర్‌లో రెండో బంతికే వికెట్ తీసుకున్న దక్షిణాఫ్రికా అదే ఆధిక్యత కనబరిచింది. భారత్ మాత్రం పరుగులను కూడబెట్టడంలో చతికిలపడింది. 46.2 ఓవర్‌ల వద్ద 211 పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా ముందు 212 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ సాయి సుదర్శన్, నాలుగో వికెట్, కెప్టెన్ కేఎల్ రాహుల్‌లు హాఫ్ సెంచరీలు చేశారు. వీరిద్దరు మినహాయిస్తే.. పిచ్‌లోకి వచ్చిన తొమ్మిది మంది కూడా తమ పరుగులను కనీసం 20 మార్క్‌ను దాటించలేపోయారు.

మూడు వన్డేల సిరీస్‌లో భారత్, దక్షిణాఫ్రికా నేడు సౌతాఫ్రికాలోని సెయింట్ జార్జ్ పార్క్‌లో రెండో వన్డే ఆడుతున్నాయి. టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్‌లు ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు. తొలి బంతినే బౌండరీకి తరలించిన రుతురాజ్ గైక్వాడ్ మరు బంతికే ఎల్‌‌బీడబ్ల్యూతో వికెట్ ఇచ్చుకున్నాడు. దీంతో ఇండియాపై ఒత్తిడి ఏర్పడింది. సాయి సుదర్శన్ ఆచితూచి ఆడటం మొదలు పెట్టాడు. గైక్వాడ్ ప్లేస్‌లో వచ్చిన తిలక్ వర్మ కూడా చాలా డాట్లు పెట్టినా.. స్కోర్ పెద్దగా సాధించకుండానే నిష్క్రమించాడు. 30 బంతుల్లో 10 పరుగులు సాధించాడు. ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ వీలు చూసుకుని బౌండరీలు కొడుతూ స్కోర్‌ను గాడిలో పెట్టాడు. సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్‌లు టీమిండియా స్కోరును కొంత పరుగులు పెట్టించారు. మూడో వికెట్‌గా సాయి సుదర్శన్‌గా, ఆ తర్వాత సంజు సాంసంగ్, కేఎల్ రాహుల్‌లు ఔట్ అయ్యారు.  167 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత స్కోర్ బోర్డు మందగించింది. 211 పరుగుల వద్ద ఆవేశ్ ఖాన్ వికెట్‌తో టీమిండియా ఆలౌట్ అయింది.

Latest Videos

Also Read: IPL 2024 Auction: 20 లక్ష‌ల‌ ఎంట్రీతో రూ.7 కోట్లు కొల్ల‌గొట్టిన యంగ్ ప్లేయ‌ర్ కుమార్‌ కుశాగ్ర

తొలి నుంచి దక్షిణాఫ్రికా బౌలర్ బర్జర్ కట్టడి చేశాడు. పది ఓవర్లు వేసి 30 రన్‌లు ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. లిజాడ్ విలియ్స్ కూడా రాణించాడు.

 

click me!