SA vs IND 3rd ODI: బ్యాట్ తో అదరగొట్టిన భారత్.. సౌతాఫ్రికా ముందు భారీ లక్ష్యం..

By Mahesh Rajamoni  |  First Published Dec 21, 2023, 8:31 PM IST

Sanju Samson: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో  సంజూ శాంస‌న్ సెంచ‌రీ చేయ‌గా, తిల‌క్ వ‌ర్మ  ఆఫ్ సెంచ‌రీతో రాణించ‌డంతో భార‌త్ 50 ఓవ‌ర్ల‌లో 296/8 పరుగులు చేసి, సౌతాఫ్రికా ముందు భారీ ల‌క్ష్యం ఉంచింది. 
 


India vs South Africa 3rd ODI: పార్ల్‌లోని బోలాండ్ పార్క్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన కీల‌క‌మైన మూడో వ‌న్డేలో భార‌త బ్యాట‌ర్స్ రాణించ‌డంతో 50 ఓవ‌ర్ల‌లో భార‌త్ 8 వికెట్లు కోల్పోయి 296/8 ప‌రుగులు చేసింది. ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్, కీప‌ర్ సంజూ శాంస‌న్ బ్యాట్ అద‌ర‌గొట్టాడు. వ‌న్డేల్లో త‌న తొలి సెంచ‌రీని న‌మోదుచేశాడు. స్లోగా సాగుతున్న పిచ్ పై అద్భుత‌మైన ఆట‌తో శాంస‌న్ తొలి వ‌న్డే సెంచ‌రీ కొట్టాడు. 114 బంతుల్లో 108 ప‌రుగులు చేసిన సంజూ శాంస‌న్.. విలియమ్స్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. శాంస‌న్ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు,  3 సిక్సులు ఉన్నాయి.  మ‌రో ప్లేయ‌ర్ తిల‌క్ వ‌ర్మ సైతం తన తొలి వన్డే ఇంటర్నేషనల్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 75 బంతుల్లో ఆడి తొలి ఫిఫ్టికి న‌మోదు చేశాడు.

భార‌త్ తొలి ప‌వ‌ర్ ప్లేలో త‌డ‌బ‌డిన‌ప్ప‌టికీ.. సంజూ శాంమ‌న్, తిల‌క్ వ‌ర్మ‌లు రాణించ‌డంతో భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన ర‌జిత్ ప‌టిదార్ 22 ప‌రుగులు చేయ‌గా, మ‌రో ఒపెన‌ర్ సాయి సుద‌ర్శ‌న్ 10 ప‌రుగులు చేసి త్వ‌ర‌గానే ఔట్ అయ్యాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 21 ప‌రుగులు చేయ‌గా, చివ‌ర‌లో రింకు సింగ్ బ్యాట్ ఝుళిపించి 38 ప‌రుగులు చేశాడు. అక్ష‌ర్ ప‌టేల్ (1), వాషింగ్ట‌న్ సుంద‌ర్ (14) నిరాశ‌ప‌రిచాడు. 

Latest Videos

సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో బ్యూరాన్ హెండ్రిక్స్  3 వికెట్లు తీసుకున్నాడు. నాంద్రే బర్గర్ 2, విలియ‌మ్స్, కేశ‌వ్ మ‌హ‌రాజ్, వియాన్ ముల్డర్ లు త‌లా ఒక వికెట్ తీసుకున్నారు. 

వికెట్ల పతనం: 34-1 ( రజత్ పాటిదార్ , 4.4), 49-2 ( సాయి సుదర్శన్ , 7.3), 101-3 ( కేఎల్ రాహుల్ , 18.5), 217-4 ( తిలక్ వర్మ , 41.2), 246-5 ( సంజు శాంసన్ , 45.3), 255-6 ( అక్సర్ పటేల్ , 46.3), 277-7 ( వాషింగ్టన్ సుందర్ , 48.5), 293-8 ( రింకు సింగ్ , 49.3)

click me!