IND vs SA: ఇదే చివరి అవకాశం.. ధోనీ రికార్డును రోహిత్‌ తిరగరాస్తాడా?

By Rajesh Karampoori  |  First Published Jan 3, 2024, 5:28 AM IST

IND vs SA: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఫ్లాప్ అయ్యాడు. ఒక్కసారి ఖాతా తెరకుండానే వెనుదిరగగా..మరోసారి సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. అటువంటి పరిస్థితిలో సిరీస్‌లోని రెండవ టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ తన బ్యాటింగ్‌తో అద్భుతాలు చేయడానికి ప్రయత్నిస్తాడా?  సిరీస్‌లోని చివరి టెస్టు మ్యాచ్ లో ధోనీ రికార్డును రోహిత్‌ తిరగరాస్తాడా? అనే ఆసక్తి టీమిండియా అభిమానుల్లో నెలకొంది.  


IND vs SA: భారత్-దక్షిణాఫ్రికా మధ్య సిరీస్‌లోని చివరి టెస్ట్ మ్యాచ్ కేప్ టౌన్‌లో జరుగుతుంది. తొలి టెస్టులో సౌతాఫ్రికా చేతిలో భారత్‌ ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు సిరీస్‌ను కాపాడుకోవాలంటే భారత్ రెండో టెస్టు మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలి. తొలి టెస్టులో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి మాత్రమే బ్యాటింగ్ లో రాణించారు. మిగితా భారత బ్యాట్స్‌మెన్ పూర్తిగా ఫ్లాప్ అయ్యారు. ఇప్పుడు రెండో టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించేందుకు భారత జట్టు శాయశక్తులా ప్రయత్నిస్తుండగా, కెప్టెన్ రోహిత్ శర్మ ధోనీ రికార్డును బద్దలు కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఇంతకీ ఆ రికార్డేంటీ?  

కెప్టెన్‌గా రోహిత్ రికార్డులు సృష్టించగలడా..?
 
రెండో టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేయడంలో రోహిత్ శర్మ రాణిస్తే.. దక్షిణాఫ్రికాలో ఆడుతూ సెంచరీ సాధించిన మూడో భారత కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిలు అలాంటి ఫీట్ చేశారు. అంటే సచిన్, కోహ్లీల రికార్డులను సమం చేసే అవకాశం రోహిత్‌కి దక్కనుంది. దక్షిణాఫ్రికాలో కెప్టెన్‌గా సచిన్ 169 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో.. విరాట్ కోహ్లి దక్షిణాఫ్రికాలో కెప్టెన్‌గా 153 పరుగుల ఇన్నింగ్స్ ఆడటంలో విజయం సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో రోహిత్ ఎలాంటి అద్భుతాలు చేయలేక కేవలం 5, 0 పరుగులకే వెనుదిగారాల్సి వచ్చింది. 

Latest Videos

ధోనీ రికార్డును రోహిత్ శర్మ బ్రేక్ చేయగలడా? 

దీంతో పాటు ధోని (రోహిత్ శర్మ వర్సెస్ ఎంఎస్ ధోని) రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టే అవకాశం కూడా లేకపోలేదు. రెండో టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ రెండు సిక్సర్లు బాదడంలో విజయవంతమైతే.. ధోనీ రికార్డును బద్దలు కొడతాడు. నిజానికి టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు సెహ్వాగ్ పేరిట ఉంది. వీరేంద్ర సెహ్వాగ్ టెస్టుల్లో మొత్తం 90 సిక్సర్లు కొట్టాడు. ధోనీ 78 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో.. రోహిత్ ఇప్పటివరకు టెస్టులో 77 సిక్సర్లు కొట్టాడు. మరీ ఈ మ్యాచ్ లోనైనా రోహిత్ ..ధోని రికార్డు బ్రేక్ చేస్తాడో వేచి చూడాలి.  

కేప్ టౌన్‌లో విరాట్ కోహ్లీ రికార్డు ఇలా..  

విరాట్ కోహ్లీ ఇప్పటివరకు కేప్ టౌన్‌లో 2 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో విరాట్ కోహ్లీ కేవలం 141 పరుగులు మాత్రమే  చేశాడు. 2022 జనవరిలో కేప్‌టౌన్‌లో కోహ్లీ 201 బంతుల్లో 79 పరుగులతో బలమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇది కాకుండా, కేప్ టౌన్‌లో అతని స్కోర్‌ మూడు సార్లు 30 పరుగుల కంటే తక్కువనే ఉంది. 2022 కేప్ టౌన్ టెస్టులో రబడ, ఎన్గిడి అతనిని అవుట్ చేశారు.

కాగా, కేప్ టౌన్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సచిన్ టెండూల్కర్ నిలిచాడు. టెండూల్కర్ కేప్ టౌన్‌లో 4 టెస్టు మ్యాచ్‌లు ఆడి.. మొత్తం 489 పరుగులు చేయడంలో విజయం సాధించాడు. 1997లో టెండూల్కర్ చేసిన 169 పరుగులే ఈ మైదానంలో భారతీయుడి అత్యధిక స్కోరు.  అలాగే.. కేప్‌టౌన్‌లో భారత్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ నిలిచాడు. ఈ మైదానంలో టెండూల్కర్ 2 సెంచరీలు సాధించాడు.

click me!