INDW vs AUSW, 3rd WODI : చివరి మ్యాచ్‌లోనూ నిరాశే , ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడిన భారత్ .. సిరీస్ వైట్‌వాష్

By Siva Kodati  |  First Published Jan 2, 2024, 8:26 PM IST

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా - భారత్ మహిళల జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియాపై ఆసీస్ 190 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 32.4 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది.


మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా - భారత్ మహిళల జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియాపై ఆసీస్ 190 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 32.4 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాట్స్‌వుమెన్లు చేతులెత్తేశారు.

స్మృతి మంథాన 29, జెమ్మీయా రోడ్రీగ్స్ 25, దీప్తి శర్మ 25 పరుగులు మాత్రమే చేయగలిగారు. భీకర ఫాంలో వున్న రిచా ఘోష్ 19, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 3, అమన్‌జోత్ కౌర్ 3, పూజా వస్త్రాకర్ 14 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జార్జియా వార్హెమ్ 3, మేఘన్ స్కాచ్ , ఆలనా కింగ్, అన్నాబెల్ సదర్లాండ్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ విజయంతో ఆస్ట్రేలియా చేతిలో భారత్ వైట్‌వాష్ అయ్యింది. 

Latest Videos

అంతకుముందు స్లోగా వున్న వాంఖడే ట్రాక్‌లో టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు అలిస్సా హీలీ 82, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 119లు తొలి వికెట్‌కు 189 పరుగులు జోడించారు. భారత బౌలర్ల ఉతికి ఆరేసిన వీరిద్దరూ జట్టు భారీ స్కోరు చేసేందుకు దోహదపడ్డారు. హీలీ కెప్టెన్‌గా తన అర్ధ శతకాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో పూజా వస్త్రాకర్.. 29వ ఓవర్‌లో హీలీని ఔట్ చేసింది. ఆపై 25 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. ఓ వైపు సహచరులు పెవిలియన్ చేరుతున్నా మరో ఎండ్‌లో ఫోబ్ మాత్రం ధాటిగా ఆడింది. ఈ క్రమంలో సెంచరీని పూర్తి చేసుకుని 119 పరుగుల వద్ద దీప్తి శర్మ చేతిలో ఔట్ అయ్యింది. 

ఈ సిరీస్‌లో భారత్‌ వన్డే జట్టులో అరంగేట్రం చేసిన శ్రేయాంక పాటిల్ వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ ఛాన్స్ మిస్ అయ్యింది. 10 ఓవర్లలో 57 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి.. ఆసీస్ మిడిల్ ఆర్డర్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు చేసిన ఫీల్డింగ్ పొరపాట్ల కారణంగా ఆసీస్ భారీ స్కోరు చేయగలిగింది. ఆస్ట్రేలియా 338 పరుగుల భారీ స్కోరు చేసినప్పుడు.. భారత్ ఈ మ్యాచ్ ఓడిపోతుందని ప్రేక్షకులు, విశ్లేషకులు అంచనా వేశారు.

అనుకున్నట్లుగానే భారత్ కనీసం 150 పరుగులు చేయలేక బొక్కబోర్లాపడింది. 2018లో వడోదరాలో చేసిన 332 పరుగులే ఇప్పటి వరకు భారత్‌పై ఆస్ట్రేలియా అత్యధిక రన్స్ . తాజా మ్యాచ్‌లో ఈ రికార్డులను ఆసీస్ బద్ధలుకొట్టింది. వన్డేల్లో 7 సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా మహిళల జట్టుపై టీమిండియా అమ్మాయిలకు ఘనమైన రికార్డు లేదు. ఆసీస్‌ చేతుల్లో వరుసగా 9 వన్డేల్లో భారత్ ఓడిపోయింది. 

click me!