IND vs SA: రెండో టెస్టులో వర్షం విలన్ అవుతుందా? కేప్ టౌన్ వాతావరణం ఎలా ఉంది?   

By Rajesh Karampoori  |  First Published Jan 3, 2024, 4:51 AM IST

IND vs SA: దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు ఒక్క టెస్టు సిరీస్‌ కూడా భారత్‌ గెలవలేకపోయింది. ఒకప్పుడు సిరీస్‌ను డ్రాగా ముగించడంలో జట్టు విజయం సాధించింది. కేప్‌టౌన్‌లో ఇప్పటివరకు ఒక  విజయం కూడా సాధించని రోహిత్ శర్మ జట్టుకు గట్టి సవాల్‌ ఎదురవుతుందని చెప్పవచ్చు.


IND vs SA: భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో రెండో మ్యాచ్ జనవరి 3 (నేటీ) నుంచి జరగనుంది. న్యూలాండ్స్ లోని కేప్ టౌన్ వేదికగా ఇరు జట్లు తలపడనున్నాయి. ఇప్పటి వరకు ఈ స్టేడియంలో భారత జట్టు ఒక్క మ్యాచ్‌లో  కూడా గెలవలేకపోయింది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో ఓటమి చవిచూసింది. రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ప్రస్తుత సిరీస్‌లో టీమిండియా 0-1తో వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ 1-1తో ముగుస్తుంది, కానీ.. ఆమె కలలు కన్న ఆశలు మాత్రం నేరవేరదు. కేప్‌టౌన్‌లో జరిగే మ్యాచ్‌లో రెండు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉంది. 

దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు ఒక్క టెస్టు సిరీస్‌ కూడా భారత్‌ గెలవలేకపోయింది. ఒకప్పుడు సిరీస్‌ను డ్రాగా ముగించడంలో జట్టు విజయం సాధించింది. కేప్‌టౌన్‌లో ఇప్పటివరకు సాధించని విజయాన్ని పరిశీలిస్తే రోహిత్ శర్మ జట్టుకు గట్టి సవాల్‌ ఎదురవుతుందని చెప్పవచ్చు. ఇక్కడ గెలవాలంటే తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. తొలి టెస్టులో టాప్‌ ఆర్డర్‌ నిరాశపరిచింది. రెండో మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ విభాగం రాణిస్తుందని టీమిండియా ఫ్యాన్స్ భావిస్తున్నారు. 
 
కేప్ టౌన్ వాతావరణ పరిస్థితులు ఇలా..

Latest Videos

సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో కూడా వర్షం బీభత్సం సృష్టించింది. ఇప్పుడు రెండో మ్యాచ్‌లోనూ అదే జరగనుందని తెలుస్తోంది. మొదటి మూడు రోజులు వర్షం కురిసే సూచన లేదు. కానీ, చివరి రెండు రోజులు ప్రతికూల వాతావరణం కారణంగా మ్యాచ్‌పై ప్రభావం పడవచ్చు. అక్యూవెదర్ ప్రకారం..  మ్యాచ్ యొక్క మొదటి మూడు రోజులు వర్షం పడే అవకాశం లేదు. ఆ తర్వాత జనవరి 6న (నాలుగో రోజు) 64 శాతం వర్షం పడే అవకాశముంది. అదే సమయంలో మ్యాచ్ ఐదో రోజు (జనవరి 7) వర్షం పడే అవకాశం 55 శాతం ఉందని వాతావరణ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

కేప్‌టౌన్‌లో ఆడడం అంత సులభం కాదా? 

భారత్ 1992లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడడం ప్రారంభించింది. ఈ 31 ఏళ్లలో న్యూలాండ్స్ స్టేడియంలో భారత జట్టు ఆరు టెస్టు మ్యాచ్‌లు ఆడింది, కానీ ఒక్కటి కూడా గెలవలేదు. 2018, 2022లో ఇక్కడ జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో భారత బ్యాట్స్‌మెన్‌ల ప్రదర్శన దయనీయంగా ఉంది. టీమిండియా ఈ రెండు టెస్ట్ మ్యాచ్‌లలో నాలుగు ఇన్నింగ్స్‌లు ఆడింది. కానీ, భారత జట్టు అత్యధిక స్కోరు 223 పరుగులు మాత్రమే.. 2018లో 209, 135, 2022లో 223, 198 పరుగులు చేసింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే.. బ్యాట్స్‌మెన్‌కు పరిస్థితులు అంత సులువుగా ఉండవని అర్థమవుతోంది.
 
ఇరు జట్లు ఇలా.. 
 
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా ), ప్రముఖ కృష్ణ, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, మహమ్మద్ సిరాజ్.

దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్ (కెప్టెన్), టోనీ డి జార్జి, ఐడెన్ మార్క్‌రామ్, కీగన్ పీటర్సన్, జుబైర్ హంజా, మార్కో జాన్సెన్, వియాన్ ముల్డర్, డేవిడ్ బెడింగ్‌హామ్ (వికెట్), ట్రిస్టన్ స్టబ్స్ (వికెట్), కైల్ వెర్రెయిన్ (వికె), నాండ్రే బెర్గర్, కేశవ్ మహరాజ్, కగిసో రబడా, లుంగి ఎన్గిడి, గెరాల్డ్ కోయెట్జీ.
 

click me!