మరోసారి కరోనా కలకలం.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య మొదటి వన్డే మళ్లీ రద్దు...

Published : Dec 06, 2020, 02:39 PM IST
మరోసారి కరోనా కలకలం.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య మొదటి వన్డే మళ్లీ రద్దు...

సారాంశం

శుక్రవారం జరగాల్సిన వన్డేని ఆదివారానికి వాయిదా... మరోసారి ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వన్డే సిరీస్‌ను వదలని కరోనా... హోటెల్ సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ఇరు జట్లు...

ఇంగ్లాండ్, సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన వన్డేను కరోనా వీడడం లేదు. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన మొదటి వన్డే ఇప్పటికే ఓసారి కరోనా కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. శుక్రవారం రోజున ఓ సౌతాఫ్రికా ప్లేయర్‌కి కరోనా పాజిటివ్ తేలడంతో ఆరోజు జరగాల్సిన వన్డేని ఆదివారానికి వాయిదా వేశారు. అయితే మరోసారి ఈ వన్డేని కరోనా అడ్డంకిగా మారింది.

మ్యాచ్ ప్రారంభం అవుతుందని ఆశపడిన ఆటగాళ్లకు మరోసారి నిరాశ తప్పలేదు. సౌతాఫ్రికా క్రికెటర్లు బస చేసిన హోటెల్‌కి చెందిన ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో మొదటి వన్డేను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇరు జట్ల ఆటగాళ్లకి మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈ సిరీస్‌పై నిర్ణయం తీసుకుంటారు.

వాయిదా వేసిన షెడ్యూల్ ప్రకారం సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య రేపు రెండో వన్డే జరగాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ