క్లబ్ క్రికెట్ ఆడుతున్నావా... ఆ నిలబడడం ఏంటి... గిల్‌కి యువరాజ్ వార్నింగ్...

By team teluguFirst Published Dec 5, 2020, 2:56 PM IST
Highlights

‘నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా గొప్ప అనుభూతి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను పోస్టు చేసిన శుబ్‌మన్ గిల్...

‘చేతులు కట్టుకో... నువ్వు ఇండియా తరుపున ఆడుతున్నావు... క్లబ్ క్రికెట్ కాదు’ అంటూ ట్రోల్ చేసిన యువరాజ్ సింగ్...

ఐపీఎల్ 2020, అంతకుముందు దేశవాళీ క్రికెట్‌లో ప్రదర్శన ఆధారంగా ఆసీస్ టూర్‌లో చోటు దక్కించుకున్నాడు భారత యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్. చివరి వన్డేలో మయాంక్ అగర్వాల్ స్థానంలో జట్టులోకి వచ్చిన శుబ్‌మన్ గిల్... విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కి 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

39 బంతుల్లో 33 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్... మూడో వన్డేలో భారత జట్టు విజయం అనంతరం కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. ‘నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా గొప్ప అనుభూతి’ అంటూ రాసుకొచ్చాడు శుబ్‌మన్ గిల్. అయితే అతను షేర్ చేసిన ఓ ఫోటోలో శుబ్‌మన్ గిల్, జేబుల్లో చేతులు పెట్టుకుని నిలబడడం స్పష్టంగా కనిపించింది. దీనిపై యువరాజ్ సింగ్ ట్రోల్ చేస్తూ వార్నింగ్ ఇచ్చాడు. 

‘ది గ్రేట్ విరాట్ కోహ్లీతో బ్యాటింగ్ చేయడం చాలా గొప్ప అదృష్టమే.. అయితే మహారాజ్ కాస్త నీ చేతులు కట్టుకో భారత జట్టు మ్యాచ్ నడుస్తోంది... నీ పాకెట్‌లో చేతులు ఎందుకు పెట్టుకున్నావు. నువ్వు టీమిండియా తరుపున ఆడుతున్నావు... క్లబ్ మ్యాచ్ కాదు’ అంటూ కామెంట్ చేశాడు యువీ.

కాన్‌బెర్రాలో జరిగిన మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. లక్ష్యచేధనలో ఆసీస్ 289 పరుగులకే పరిమితం కావడంతో మొదటి రెండు వన్డేల్లో ఓడిన టీమిండియాకి ఓదార్పు విజయం దక్కింది.

 

click me!