సెంచరీల మోత మోగిస్తున్న రుతురాజ్.. విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లోనూ శతకం..

Published : Dec 02, 2022, 01:48 PM IST
సెంచరీల మోత మోగిస్తున్న రుతురాజ్.. విజయ్ హజారే  ట్రోఫీ ఫైనల్లోనూ శతకం..

సారాంశం

Vijay Hazare Trophy 2022: దేశవాళీలో తనకు ఎదురేలేదంటున్నాడు  మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. విజయ్ హజారే ట్రోఫీలో  సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నాడు.   

విజయ్ హజారే ట్రోఫీలో  మహారాష్ట్ర సారథి రుతురాజ్ గైక్వాడ్ శతకాల  పండుగ చేసుకుంటున్నాడు. ఈ టోర్నీలో గత వారం ముగిసిన క్వార్టర్స్ లో డబుల్ సెంచరీ చేసిన ఈ పూణె కుర్రాడు.. సెమీస్ లో అసోంపై కూడా సెంచరీ  బాదాడు. ఇక తాజాగా  సౌరాష్ట్రతో జరుగుతున్న ఫైనల్ లో కూడా శతకం (131 బంతుల్లో 108, 7 ఫోర్లు, 4 సిక్సర్లు)  సాధించాడు.   గతేడాది కూడా ఇదే ట్రోఫీలో దుమ్మురేపిన రుతురాజ్.. ఈ సీజన్ లో కూడా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. 

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న  మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన  మహారాష్ట్ర  నాలుగో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది.  ఓపెనర్ పవన్ షా (4) , విఫలమయ్యాడు.   సౌరాష్ట్ర బౌలర్లు  కట్టుదిట్టంగా  బౌలింగ్ చేయడంతో   మహారాష్ట్ర కు పరుగుల రాక కష్టమైంది. 

సౌరాష్ట్ర బౌలర్ల విజృంభణతో  రుతురాజ్ తన హాఫ్ సెంచరీని  96 బంతుల్లో చేశాడు.   30 ఓవర్లకు  మహారాష్ట్ర స్కోరు 100 పరుగులు దాటింది.   రన్ రేట్ మరీ తక్కువగా ఉండటంతో రుతురాజ్ రెచ్చిపోయాడు.  తర్వాత 50 పరుగులు చేయడానికి రుతురాజ్ 29 బంతులే తీసుకున్నాడు.  సెంచరీ తర్వాత   రనౌట్ అయ్యాడు. 

రుతురాజ్ నిష్క్రమణ తర్వాత మహారాష్ట్ర తరఫున అజిమ్ కాజి (37), నౌషద్ షేక్ (31)  లు కాస్త ధాటిగా ఆడారు. దీంతో  ఆ జట్టు  నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. 

రుతురాజ్ సూపర్ ఫామ్.. 

 ఈ సీజన్ లో  రుతురాజ్ 5 ఇన్నింగ్స్ లు ఆడి 660 పరుగులు చేయడం గమనార్హం.  ఇందులో నాలుగు సెంచరీలు కూడా ఉన్నాయి.   2021 - 22 సీజన్ లో  కూడా  రుతురాజ్  నాలుగు సెంచరీలు చేయడం విశేషం.  ఇక విజయ్ హజారే ట్రోఫీ అంటేనే రెచ్చిపోయే గైక్వాడ్.. ఈ ట్రోఫీలో గడిచిన 10 ఇన్నింగ్స్ లలో ఏకంగా 1,263 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉన్నాయి.  గత పది ఇన్నింగ్స్ లలో రుతురాజ్ స్కోర్లు ఇలా ఉన్నాయి.. 136, 154, 124, 21, 168, 124, 40, 220, 168, 108.. ఈ గణాంకాలు చూస్తేనే అర్థం చేసుకోవచ్చు  ఈ పూణె కుర్రాడి జోరు ఎలా సాగుతుందో.. 

 


 

PREV
click me!

Recommended Stories

IND vs SA : గిల్ రెడీనా? భారత జట్టులోకి ముగ్గురు స్టార్ల రీఎంట్రీ
Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు