బామ్మర్ది పెళ్లి కోసం మొదటి వన్డేకి దూరంగా రోహిత్ శర్మ... కెప్టెన్ అయ్యుండి, ఇంకెనాళ్లు ఇలా అంటూ!...

Published : Mar 15, 2023, 04:32 PM IST
బామ్మర్ది పెళ్లి కోసం మొదటి వన్డేకి దూరంగా రోహిత్ శర్మ... కెప్టెన్ అయ్యుండి, ఇంకెనాళ్లు ఇలా అంటూ!...

సారాంశం

ముంబైలో తన భార్య తమ్ముడి వివాహ వేడుకలో సందడి చేస్తున్న రోహిత్ శర్మ... కెప్టెన్ అయ్యాక కూడా ఇలా చిన్న చిన్న విషయాల కోసం లీవ్ పెట్టడంపై ఫ్యాన్స్ సీరియస్.. 

గత ఏడాది టీమిండియా రికార్డు స్థాయిలో మొదటి 8 నెలల కాలంలో ఏడుగురు కెప్టెన్లను మార్చింది... పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ, ఆ విషయం మరిచిపోయినట్టుగా అప్పుడప్పుడూ టీమ్‌లోకి వచ్చి పోయాడు. ఫిట్‌నెస్ సమస్యలు, వ్యక్తిగత కారణాలు, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ పేరుతో టీమిండియా ఆడిన మెజారిటీ సిరీస్‌లకు దూరమయ్యాడు రోహిత్ శర్మ...

తాజాగా మరోసారి రోహిత్ శర్మ, ఇలాంటి కారణంతోనే ఆస్ట్రేలియాతో తొలి వన్డేకి దూరంగా ఉండబోతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023ని ముగించిన టీమిండియా, మార్చి 17 నుంచి వన్డే సిరీస్‌లో పాల్గొనబోతోంది. మార్చి 17న ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి వన్డే జరగనుంది.

అయితే వ్యక్తిగత కారణాలతో ఈ మ్యాచ్‌కి దూరంగా ఉండబోతున్నాడు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ప్రస్తుత తన భార్య రితికా సాగ్జే సోదరుడు కృనాల్ వివాహ వేడుకల్లో బిజీగా ఉన్నాడు. మార్చి 16, 17 తేదీల్లో కృనాల్ పెళ్లి జరగనుంది. ఇది ముగిసిన తర్వాత టీమిండియాతో కలుస్తాడు రోహిత్ శర్మ. బామ్మర్ది పెళ్లి కోసం టీమిండియా ఆడే మ్యాచ్‌కి దూరమైన రోహిత్ శర్మను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు అభిమానులు...

ఉమేశ్ యాదవ్, తన భార్య ఐసీయూలో ఉన్నప్పుడు కూడా టీమిండియా తరుపున టెస్టు మ్యాచ్ ఆడాడు. మహ్మద్ సిరాజ్, తన తండ్రిని కడసారి చూసుకోవడం కంటే టీమిండియాకి ఆడేందుకే ప్రాధాన్యం ఇచ్చాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అయితే అప్పుడే పుట్టిన తన కూతుర్ని చూసుకోవడం కోసం మూడు నెలలు ఆడాడు... అలాంటిది రోహిత్ శర్మ, బామ్మర్ది పెళ్లి అని, బావ తమ్ముడి ఎంగేజ్‌మెంట్ అని చిన్న చిన్న కారణాలతో టీమ్‌కి దూరం కావడం కరెక్ట్ కాదని అంటున్నారు...

రోహిత్ శర్మ ఇంతకుముందు చాలాసార్లు ఇలాంటి కారణాలతో టీమ్‌కి దూరమయ్యాడు. అయితే అప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్ కాదు కాబట్టి టీమ్‌పై పెద్దగా ప్రభావం చూపించలేదు. కానీ ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాడు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమ్‌ని నడిపించబోతున్నాడు. అలాంటి రోహిత్, ఇలా చిన్న చిన్న విషయాల కోసం లీవ్ తీసుకోవడం అభిమానులకు అస్సలు నచ్చడం లేదు.. 

అప్పుడెప్పుడో 2007లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు రోహిత్ శర్మ. స్పిన్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ, ఓపెనర్‌గా మారిన తర్వాతే టీమిండియాలో స్థిరమైన చోటు సంపాదించుకోగలిగాడు. 2013లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మారిన తర్వాత రోహిత్ ఆట, రేంజ్ అన్నీ మారాయి...

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఐదు టైటిల్స్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మకు టీమిండియా కెప్టెన్సీ దక్కింది. ఐదేళ్ల పాటు మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా కొనసాగిన విరాట్ కోహ్లీ, 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని తీసుకున్న నిర్ణయం... రోహిత్ శర్మను కెప్టెన్‌ని చేసింది. 

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా మరో రెండుమూడేళ్లు కొనసాగాలని అనుకుని ఉంటే, రోహిత్ శర్మ ప్లేయర్‌గానే రిటైర్ అవ్వాల్సి వచ్చేది. టీ20 కెప్టెన్సీతో పాటు వన్డే కెప్టెన్సీ కూడా కావాలని రోహిత్ శర్మ పట్టుబట్టడం.. విరాట్ కోహ్లీ మీద కక్షకట్టిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పావులు కదపడంతో టీమిండియా వైట్ బాల్ కెప్టెన్‌గా మారాడు ‘హిట్ మ్యాన్’...

బీసీసీఐ రాజకీయాలతో విసుగు చెంది విరాట్ కోహ్లీ, టెస్టు కెప్టెన్సీని కూడా వదులుకోవడంతో లేటు వయసులో మూడు ఫార్మాట్లలో టీమిండియాని నడిపించే భారాన్ని ఎత్తుకున్నాడు రోహిత్ శర్మ..  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?