సచిన్, హషీం ఆమ్లా రికార్డులను బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

By telugu team  |  First Published Jan 17, 2020, 6:18 PM IST

టిమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సచిన్ టెండూల్కర్, హషీం ఆమ్లా రికార్డులను బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలిాయాపై రెండో వన్డే మ్యాచులో రోహిత్ శర్మ సచిన్, ఆమ్లాల రికార్డులను అధిగమించాడు.


రాజ్ కోట్: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ శుక్రవారంనాడు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, దక్షిణాఫ్రికాకు చెందిన హషీం ఆమ్లా రికార్డులను బద్దలు కొట్టాడు. ఓపెనర్ గా వన్డేల్లో అత్యంత వేగంగా 7 వేల పరుగుల మైలు రాయిని దాటిన క్రికెటర్ గా రోహిత్ శర్మ ఈ రికార్డు నెలకొల్పాడు. 

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ శర్మ ఆ ఘనతను సాధించాడు. ఆ మైలు రాయిని దాటడానికి రోహిత్ శర్మ 137 ఇన్నింగ్సు తీసుకున్నాడు. ఆమ్లా రెండో స్థానంలో నిలిచాడు. అతను ఆ మైలురాయిని 147 ఇన్నింగ్సుల్లో చేరుకున్నాడు. టెండూల్కర్ 160 ఇన్నింగ్సుల్లో 7 వేల పరుగులు దాటాడు. 

Latest Videos

undefined

రోహిత్ శర్మ 7 వేల పరుగుల మైలు రాయి దాటిన నాలుగో భారత బ్యాట్స్ మన్ నిలిచాడు. టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేందర్ సెహ్వాగ్ ఆ మైలురాయిని చేరుకున్నారు. 

ముంబైలో జరిగిన తొలి వన్డేలో విఫలమైన రోహిత్ శర్మ రెండో వన్డేలో ఫామ్ లోకి వచ్చినట్లు కనిపించాడు. 44 బంతుల్లో 42 పరుగులు చేసి ఆడమ్ జంపా బౌలింగులో అవుటయ్యాడు. వన్డేల్లో 9 వేల పరుగుల మైలురాయి చేరుకోవడానికి నాలుగు పరుగులు కావాల్సి ఉండగా అతను పెవిలియన్ చేరుకున్నాడు. 

Also Read: ఆడమ్ జంపా: తొలి వన్డేలో కోహ్లీ, రెండో వన్డేలో రోహిత్ శర్మ

భారత జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ గా ప్రారంభమైన రోహిత్ శర్మను మహేంద్ర సింగ్ ధోనీ టాప్ ఆర్డర్ లోకి మార్చాడు. 2013 చాంపియన్స్ ట్రోఫీలో ధోనీ అతన్ని టాప్ ఆర్డర్ లోకి ప్రమోట్ చేశాడు. 

అప్పటి నుంచి రోహిత్ శర్మకు తిరుగులేకుండా పోయింది. ఇన్నింగ్స్ ఓపెనర్ గా దించాలనే నిర్ణయమే వన్డేల్లో తన కెరీర్ ను మలుపు తిప్పిందని, ఆ నిర్ణయం ధోనీ తీసుకున్నాడని, ఆ తర్వాత తాను ఉత్తమ బ్యాట్స్ మన్ ను అయ్యానని, తన ఆటను బాగా అర్థం చేసుకోవడానికి అది పనికి వచ్చిందని, పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందడానికి అవకాశం కల్పించందని  రోహిత్ శర్మ అన్నాడు. 

ధోనీ తన వద్దకు వచ్చి ఇన్నింగ్సును నువ్వు ప్రారంభించాలని నేను కోరుకుంటున్నానని, నువ్వు రాణించగలవనే నమ్మకం నాకు ఉందని, నువ్వు కట్, పుల్ షాట్స్ రెండు బాగా ఆడగలుగుతావు. అది ఓపెనర్ గా రాణించడానికి ప్రమాణాలు అని ధోనీ అన్నట్లు చెప్పాడు. 

click me!